Makeup Artist comments on Buchi Babu: కొన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ స్పేస్ ఏ మాత్రం ఉండదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ని బలవంతంగా జోడించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి ఏర్పడింది. వాస్తవానికి చాలా గొప్ప కాన్సెప్ట్ ని డైరెక్టర్ బుచ్చి బాబు ఎంచుకున్నాడు. ఈ కాన్సెప్ట్ , కథ కు అసలు హీరోయిన్ అవసరం ఏ మాత్రం లేదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కి హీరోయిన్ క్యారెక్టర్ లేకపోతే సినిమా ఎక్కదు అనే భయం తో , జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు బుచ్చి బాబు. ఈ క్యారెక్టర్ ని ఆయన జెన్ జీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టు ఉన్నాడు , కానీ అది మిస్ ఫైర్ అయ్యి సోషల్ మీడియా లో విపరీతమైన నెగెటివిటీ ని ఎదురుకుంటుంది.
ఇలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసినందుకు డైరెక్టర్ బుచ్చి బాబు ని ఆడియన్స్ ఎలా తిడుతున్నారో , అలాంటి క్యారెక్టర్ లో నటించినందుకు హీరోయిన్ జాన్వీ కపూర్ ని కూడా అదే రేంజ్ లో తిడుతున్నారు నెటిజెన్స్. రోజురోజుకు ఈ ట్రోల్స్ ఎక్కువ అయిపోయాయి, దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ట్రోల్స్ పై స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ చిత్రం లో నటించిన జగపతి బాబు కూడా జాన్వీ కపూర్ పై ట్రోల్స్ చేయడం సరికాదు అంటూ రెస్పాన్స్ అయ్యాడు. అదే విధంగా యాంకర్ అనసూయ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. కన్నడ టాప్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ కూడా ఈ వ్యవహారం పై స్పందిస్తూ , హీరోయిన్స్ పెద్ద సినిమాల్లో కనిపిస్తే ఎక్కువ రీచ్ వస్తుందని , వాళ్లకు ఇష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది , జాన్వీ కపూర్ పరిస్థితి కూడా అదే, అలాంటి పాత్రలో నటించడం ఆమె తప్పు కాదు , కానీ అలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేయడం తప్పు అంటూ చెప్పుకొచ్చింది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ అంశం పై జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ సావలీన్ కౌర్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. జాన్వీ కపూర్ డైరెక్టర్ బుచ్చి బాబు కి ఒక ప్రొఫెషినల్ బౌండరీ ని గీశాడని, కానీ ఆయన జాన్వీ కపూర్ చేత ఆ గీతని దాటించేలా చేసాడని చెప్పుకొచ్చారు. బోల్డ్ సన్నివేశాల్లో నటించాను అని డైరెక్టర్ బుచ్చి బాబు కి జాన్వీ కపూర్ ముందుగానే చెప్పారని, కానీ బుచ్చి బాబు అందుకు ఒప్పుకోలేదని , కమెర్షియాలిటీ కోసం ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలను తొలగించకుండా అలాగే ఉంచేశారని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల , ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సి వస్తుందని ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనం గా మారింది.
