Kanguva: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ సూర్యకి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఇక ఆయన చేసిన సినిమాలు ఎలా ఉన్నా కూడా అక్కడి ప్రేక్షకులు అతన్ని విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాలకి తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా విశేషమైన ప్రేక్షకాదరణ దక్కుతుందనే చెప్పాలి. ఇక ఆయన చేసిన గజిని, సింగం సినిమాలు తెలుగులో విపరీతంగా ఆడాయి.
ఇక ముఖ్యంగా ఆయనకి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ‘కంగువ’ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేక కొన్ని రోజుల నుంచి చాలా సతమతమవుతున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఒక అనౌన్స్ మెంట్ అయితే సినిమా యూనిట్ అందించింది. అయితే అఫీషియల్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కానప్పటికి దీపావళిని బేస్ చేసుకొని ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి ఒక న్యూస్ అయితే బయటికి వచ్చింది. ఇక మొన్నటి దాకా దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు.
కానీ దసరకి దేవర లాంటి భారీ సినిమా ఉండడంతో దసర రేస్ నుంచి తప్పుకొని దీపావళికి బరిలో నిలవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే సూర్య కంగువ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో కనుక ఆయన సూపర్ సక్సెస్ అందుకుంటే మరోసారి ఆయన స్టార్ హీరోగా గుర్తింపబడతాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో ఆయనకు భారీ సక్సెస్ అయితే దక్కలేదు.
కాబట్టి ఇప్పుడు ఎలాగైనా ఇండియా వైడ్ గా సక్సెస్ ని సాధించి తన మార్కెట్ కూడా భారీగా పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా సూర్య కమిట్ అయ్యాడు. ముందుగా కంగువ సినిమా సక్సెస్ సాధిస్తే, ఇక ఆ తర్వాత ఈ సినిమా మీద మరింత ఫోకస్ పెట్టి వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో సూర్య ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…