Site icon OkTelugu

Ramayana movie: రామాయణం మూవీ టైటిల్ మార్చడం వెనక అసలు కారణం ఏంటంటే..?

Reason behind the Ramayana movie title change

Reason behind the Ramayana movie title change

Ramayana movie: ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే అయిపోయింది. అందుకే ఏ భాషల్లో ఉన్న హీరో, హీరోయిన్లైనా అన్ని భాషలలో నటిస్తూ నటులుగా వాళ్లకు మంచి గుర్తింపునైతే సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నితీష్ తివారి దర్శకత్వంలో రన్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ‘రామాయణం’ అనే ఒక సినిమా తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే రామాయణం సినిమా మీద అల్లు అరవింద్, మధు మంతెన ఇద్దరు కూడా కేసు వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాను మొదట వాళ్ళతో చేస్తానని కమిట్ అయిన దర్శకుడు వాళ్లకు సంబంధించిన లావాదేవీలను చూసుకోకుండానే ఈ సినిమాని మరొకరితో చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన వాళ్లు ఈ సినిమాని ఆపేయాలనే ఉద్దేశ్యంతోనే కోర్టుకెక్కినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ వివాదం ఇలా ఉండగానే రామాయణం సినిమాకు సంబంధించిన టైటిల్ ని కూడా చేంజ్ చేయబోతున్నట్టుగా సినిమా దర్శకుడు నితీష్ తివారీ కొన్ని సందర్భాల్లో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ ను అల్లు అరవింద్ రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన టైటిల్ని వీళ్ళు వాడుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ సినిమాకి రామాయణం బదులుగా ‘గాడ్ పవర్ ‘ అనే టైటిల్ ని పెట్టాలనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా దాదాపు 800 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక ఇందులో కన్నడ స్టార్ హీరో అయిన యశ్ కూడా రావణుడి పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాని ఈ సంవత్సరం షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం రిలీజ్ కి రెడీ చేయాలని దర్శకుడు నితీశ్ తివారీ అనుకుంటున్నాడు…

Exit mobile version