https://oktelugu.com/

OG VS Akhand 2: పవన్ కళ్యాణ్ కి తలనొప్పిగా మారిన ‘అఖండ 2’..పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన బాలయ్య!

సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన సందర్భంగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని కాసేపటి క్రితమే ఒక ప్రోమో వీడియో ద్వారా తెలియచేసారు. వచ్చే ఏడాది విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఇదే తేదీన పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం 'ఓజీ' ని కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

Written By:
  • Vicky
  • , Updated On : December 11, 2024 / 10:05 PM IST

    OG VS Akhand 2

    Follow us on

    OG VS Akhand 2:  ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు, కీలక నేతలు ఎంత సాన్నిహిత్యంతో ముందుకు పోతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా గుట్టు చప్పుడు కాకుండా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నారు. మధ్యలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పటికీ, అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకుంటున్నారు. రాజకీయ పరంగా అంతా బాగానే ఉంది , కానీ వీళ్ళ మధ్య సినిమాల కారణంగా వైరం పెరగనుందా అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం ఎంత సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘అఖండ 2’ చిత్రాన్ని బోయపాటి శ్రీను ఇటీవలే ప్రారంభించాడు. ఈ సినిమా ముహూర్తం షాట్ లో బాలయ్య చెప్పిన డైలాగ్ కూడా బాగా వైరల్ అయ్యింది.

    ఇదంతా పక్కన పెడితే నేటి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన సందర్భంగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని కాసేపటి క్రితమే ఒక ప్రోమో వీడియో ద్వారా తెలియచేసారు. వచ్చే ఏడాది విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. మంచిదే కదా..!, ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశల పై నీళ్లు చల్లడం ఏంటి అని అనుకుంటున్నారా?, అక్కడికే వస్తున్నాం. ఇదే తేదీన పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘ఓజీ’ ని కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. దాదాపుగా 80 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ముందుగా మార్చి 27 వ తారీఖున విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదల కాబోతుంది.

    చాలా కాలం నుండి సెట్స్ మీద ఉన్న ప్రాజెక్ట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమానే ముందుగా విడుదల చేసుకునేందుకు నిర్మాతలకు అనుమతిని ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ జరుగుతుంది. ఈనెల 22 వ తారీఖుతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. మార్చి 28 న ఈ సినిమాని విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాగో ఓజీ చిత్రం మార్చి 28న రాదు కాబట్టి, సెప్టెంబర్ 25 వ తారీఖున విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీని బాలయ్య ‘అఖండ 2’ చిత్రం తో లాక్ చేసుకున్నాడు. మరి బాలయ్య పవన్ కళ్యాణ్ కోసం వెనక్కి జరుగుతాడా?, ఎందుకంటే ఓజీ మూవీ షూటింగ్ ఫిబ్రవరి తో పూర్తి అవుతుంది, విడుదలకు సిద్ధంగా ఉంటుంది. న్యాయంగా అయితే ఓజీ నే ఆ తేదీన విడుదల అవ్వాలి. మరి బాలయ్య ఆ తేదీని వదులుకొని సంక్రాంతికి తన సినిమాని వాయిదా వేసుకుంటాడా?, లేకపోతే అదే తేదీన వస్తాడా అనేది చూడాలి.