Nandamuri Mokshagna : నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ఇటీవలే గ్రాండ్ గా మొదలైన సంగతి తెలిసిందే. ‘హనుమాన్’ వంటి సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ తన ఫోకస్ మొత్తం ఎక్కువగా ‘జై హనుమాన్’ చిత్రం మీదనే పెట్టాడని, మోక్షజ్ఞ తో చేస్తున్న చిత్రానికి కేవలం ఆయన కథ మాత్రమే అందించాలగాలను అని బాలయ్య తో చెప్పి ఆ సినిమా నుండి తప్పుకున్నాడని, ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి. వీటిల్లో ఏది నిజం అనేది ప్రస్తుతానికి తెలియదు కానీ, బాలయ్య తన కుమారుడి కోసం ఒక సెన్సేషనల్ డైరెక్టర్ ని సెట్ చేసాడని తెలుస్తుంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, కల్కి చిత్ర దర్శకుడు నాగ అశ్విన్.
రీసెంట్ గానే నాగ అశ్విన్ బాలయ్య ని కలిశాడని, తన కొడుకుతో ఒక మంచి పీరియడ్ డ్రామా చిత్రం చేయాలని బాలయ్య రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. మరి ఈ చిత్రం మోక్షజ్ఞ మొదటి సినిమా అవుతుందా, లేదా రెండవ సినిమా అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇది పక్కన పెడితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంది అనేది విషయం మాత్రం వాస్తవం. అయితే బాలయ్య తన కొడుకుతో ‘ఆదిత్య 369 ‘ సీక్వెల్ ‘ఆదిత్య 999 ‘ చిత్రాన్ని తెరకెక్కించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. రీసెంట్ గా ‘అన్ స్టాపబుల్’ షోలో కూడా ఆయన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి స్వయంగా బాలయ్య బాబే దర్శకత్వం వహిస్తాడని కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు నాగ అశ్విన్ ని ఆయన కలవడంతో, బాలయ్య దర్శకత్వం వహించాలనే ఆలోచన పక్కన పెట్టి, ‘ఆదిత్య 999’ బాధ్యతలను నాగ అశ్విన్ కి అప్పగించాడా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
కల్కి చిత్రం తో నాగ అశ్విన్ ఒక కొత్త అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు. సైన్స్ ఫిక్షన్ కి మహాభారతం ని జోడించి ఆయన తీసిన తీరు అద్భుతం. అందుకే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ‘ఆదిత్య 999’ కూడా సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఉండే సినిమా కాబట్టి, ఈ చిత్రానికి తనకంటే నాగ అశ్విన్ ఎక్కువ న్యాయం చేయగలడు అని బాలయ్య నమ్మి, ఆ ప్రాజెక్ట్ ఆయన చేతుల్లో పెట్టి ఉండొచ్చు అని అంటున్నారు. ఈ చిత్రాన్ని సరిగ్గా తీస్తే మోక్షజ్ఞ ఓవర్ నైట్ లో పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయిపోవచ్చు. ఆ రేంజ్ బాలయ్య తన కొడుక్కి లైనప్ సెట్ చేస్తున్నాడు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. సంక్రాంతి లోపు ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.