https://oktelugu.com/

Comedian Satya : రెమ్యూనరేషన్ విషయం లో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న కమెడియన్ సత్య..మీడియం రేంజ్ హీరోలను దాటేసాడుగా!

మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరు ఇప్పుడు కమెడియన్ సత్య డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు, డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులు బాగా సంపాదించాలి అనే సూత్రాన్ని బలంగా అనుసరిస్తున్నాడు సత్య.

Written By:
  • Vicky
  • , Updated On : December 11, 2024 / 09:52 PM IST

    Comedian Satya

    Follow us on

    Comedian Satya : ఒక జూనియర్ ఆర్టిస్టు గా కెరీర్ ని మొదలు పెట్టి, ఎన్నో ఒడిదుడుగులను ఎగురుకుంటూ, వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, టాలెంట్ ని నమ్ముకొని పైకి ఎదిగిన కమెడియన్స్ లో ఒకరు సత్య. ప్రస్తుతం ఈయన రేంజ్ మన టాలీవుడ్ లో ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. కమెడియన్ సత్య ని చూసి థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఆ రేంజ్ ఇమేజిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన కామెడీ టైమింగ్ కి పొట్ట చెక్కలు అవ్వాల్సింది. సినిమాలో కంటెంట్ లేని ఎన్నో సన్నివేశాలను ఈయన తన కామెడీ టైమింగ్ తో పైకి లేపేస్తున్నాడు, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అందుకే మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరు ఇప్పుడు కమెడియన్ సత్య డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు, డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులు బాగా సంపాదించాలి అనే సూత్రాన్ని బలంగా అనుసరిస్తున్నాడు సత్య.

    ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన ‘మత్తు వదలరా 2’ చిత్రం సత్య క్రేజ్ ని పదింతలు చేసింది. ఈ చిత్రానికి ముందు ఆయన ఒక్కో సినిమాకి రోజుకు లక్ష రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునేవాడు. కాదు ఇప్పుడు రోజుకి మూడు లక్షల 50 వేల రూపాయిలను డిమాండ్ చేస్తున్నాడట. అంటే సత్య ఒక సినిమా కోసం 10 రోజులు పని చేస్తే 35 లక్షల రూపాయిలు ఇవ్వాలి అన్నమాట. ఒకప్పుడు బ్రహ్మానందం స్థాయి రేంజ్ కమెడియన్స్ రోజుకి రెండు నుండి మూడు లక్షల రూపాయిలు డిమాండ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సత్య వాళ్లకు మించిన రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడు. సత్య ఒక సినిమాలో ఉంటే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనే బ్రాండ్ ఇమేజ్ వచ్చేయడం తో మేకర్స్ కూడా మారు మాట్లాడకుండా సత్య డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ ని ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారట.

    భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కాబట్టి డైరెక్టర్స్ కూడా సత్య ని వృధా చేయకుండా తమ సినిమాల కోసం వాడుకుంటున్నారు. కేవలం ఆయన కోసమే బలమైన సన్నివేశాలను రాసుకుంటున్నారు డైరెక్టర్స్. రీసెంట్ గా సత్యదేవ్ నటించిన ‘జీబ్రా’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడానికి కారణం, సత్య కామెడీ టైమింగ్ అని రివ్యూస్ కూడా వచ్చాయి. ఇలా ప్రతీ సినిమాకి సత్య ఒక ఆభరణం అయిపోతున్నాడు. కాబట్టే రెమ్యూనరేషన్ ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 8 తెలుగు సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ శాతం మీడియం రేంజ్ హీరోల సినిమాలే ఉన్నాయి. దీంతో మీడియం హీరోల సినిమాల పాలిట దేవుడిలాగా మారిపోయాడు కమెడియన్ సత్య. రాబోయే రోజుల్లో ఈయన ఇంకా ఏ రేంజ్ కి వెళ్ళబోతున్నాడో చూడాలి.