Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరోయిన్ కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. గీత గోవిందం వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, ప్రోమో వీడియో లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి దాపవాలి కానుకగా ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రా విడుదల తేదీని మారుస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గతంలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చ్చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే పలు కారణాల రీత్యా ఈ సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ మేరకు సర్కారు వారి పాట చిత్రాన్ని 2022 సమ్మర్ లో ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేస్తున్నాట్లో సోషల్ మీడియా వేదికగా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోని విడుదల కావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ విడుదల ను పోస్ట్ పోన్ చేయడంతో మహేశ్ బాబు అభిమానులు నిరాశ చెందుతున్నారు.
The Date is Locked for the Auction & the Action in Theatres 🔥#SarkaruVaariPaata Grand Release on 1st APRIL, 2022 💥#SarkaruVaariPaataOnApril1
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/pLN14g2ER1
— Mythri Movie Makers (@MythriOfficial) November 3, 2021
సంక్రాంతి బరిలో నిలిస్తున్నట్లు అందరికంటే ముందుగానే ఈ మూవీ టీమ్ ప్రకటించింది. అయితే అనుకోని రీతిలో జనవరి 7న దర్శకదిగ్గజం రాజమౌళి సినిమా “ఆర్ ఆర్ ఆర్’ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రాన్ని విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. కాగా వచ్చే ఏడాది జనవరి 12న భీమ్లా నాయక్, జనవరి 14న రాధేశ్యామ్ భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. దీంతో నిర్మాతలు ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.