Namrata Shirodkar GYM: సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ వయసు 51 ఏళ్ళు. ఆమెకు అంత ఏజ్ అంటే ఎవరూ నమ్మరు. ఫిఫ్టీ ప్లస్ లో కూడా నమ్రత స్లిమ్ అండ్ ఫిట్ బాడీ మైంటైన్ చేస్తున్నారు. దానికి కారణం అందం అంటే మక్కువ, ఆరోగ్యం అంటే శ్రద్ధ. అందులోనూ నమ్రత మాజీ హీరోయిన్. స్టార్ హీరో వైఫ్. మహేష్ తో పాటు అనేక ఈవెంట్స్ కి ఆమె హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఫిట్నెస్ అండ్ బ్యూటీ చాలా అవసరం. వయసు పెరిగే కొద్దీ శరీరం పటుత్వం కోల్పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే కఠిన వ్యాయామం తప్పనిసరి. ఆహార నియమాలు కూడా పాటించాలి.
నమ్రత ఎంతటి కఠిన కసరత్తులు చేస్తారో తెలియజేస్తూ ఆమె ఓ వీడియో షేర్ చేశారు. జిమ్ ట్రైనర్ కుమార్ మన్నవ పర్యవేక్షణలో గతంలో చేయని కొత్త వ్యాయామాలు ఆమె చేస్తున్నారు. ఈ మేరకు కామెంట్ రూపంలో తెలియజేశారు. తనకు సహనంగా వ్యాయామంలో శిక్షణ ఇస్తున్న కుమార్ మన్నవకు నమ్రత ధన్యవాదాలు తెలిపారు. నమ్రత లేటెస్ట్ వర్క్ అవుట్ వీడియో వైరల్ అవుతుంది.
నమ్రత ఫార్మర్ మోడల్ అండ్ స్టార్ హీరోయిన్. 2005లో మహేష్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వంశీ మూవీలో నమ్రత మహేష్ కి జంటగా నటించారు. ఆ చిత్ర షూటింగ్ లో సమయంలో ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు రహస్యంగా ప్రేమించుకున్న మహేష్-నమ్రత పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నమ్రతను కోడలిగా కృష్ణ అంగీకరించలేదట. మహేష్ పట్టుబట్టడంతో పాటు కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారట.
ముంబైలో పుట్టిపెరిగిన నమ్రత తెలుగింటి కోడలిగా నిలబడుతుందా? అని పలువురు సందేహపడ్డారు. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ… నమ్రత గొప్ప గృహిణిగా పేరు తెచ్చుకున్నారు. నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి మహేష్ ఫ్యామిలీకి అంకితమైంది. గౌతమ్, సితారలు జన్మనిచ్చిన నమ్రత పిల్లల ఆలనా పాలనా చూసుకున్నారు. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యాక మహేష్ కి సలహాదారుగా మారారు. ఆయన పేరును నమ్రత పలు వ్యాపారాలు చేస్తున్నారు. మహేష్ సక్సెస్ లో నమ్రత పాత్ర ఎంతగానో ఉంది.