Mahesh Babu Look : మైండ్ బ్లాక్ చేస్తున్న మహేష్ లుక్… రాజమౌళి సినిమా కోసమేనా!

ఈ పుకార్లను చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఖండించారు. చెప్పినట్లు సంక్రాంతికి గుంటూరు కారం విడుదల అవుతుందని గట్టిగా చెప్పారు.

Written By: NARESH, Updated On : October 11, 2023 7:32 pm

mahesh babu1

Follow us on

Mahesh Babu Look : ఇండియాలో హాలీవుడ్ రేంజ్ ఫిగర్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో మహేష్ ఒకరు. ఆయన హైట్, చార్మ్, కలర్ మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. ఈ క్రమంలో రాజమౌళి చిత్రంలో ఆయన ఎలా ఉండనున్నారో అనే ఊహ కూడా గూస్ బంప్స్ కలిగిస్తుంది. రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో మహేష్ మూవీ తెరకెక్కనుంది. మహేష్ కట్ అవుట్ కి సరిపోయేలా హాలీవుడ్ రేంజ్ సబ్జెక్టు ఎంచుకున్నాడు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ కనిపించనున్నాడు. ఇండియానా జోన్స్ ని తలపించేలా జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది.

స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కాగా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్, నటులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఈ చిత్రంలో మహేష్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఎప్పటి నుండో మొదలైంది. ఈ మధ్య మహేష్ తరచుగా జిమ్ లో కనిపిస్తున్నారు. తన హీరోలను కండలతో ప్రెజెంట్ చేయడం రాజమౌళికి అలవాటు. ఇక మహేష్ ఇంత వరకు చొక్కా విప్పింది లేదు.

ఫ్యాన్స్ తీరని కోరికగా ఉన్న సిక్స్ ప్యాక్ అవతార్ రాజమౌళి ఎంచుకునే అవకాశం కలదు. కాగా మహేష్ తన లేటెస్ట్ లుక్ షేర్ చేశాడు. సూట్ లో సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. దీంతో ఇదే రాజమౌళి మూవీ లుక్కా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సూట్ లో నీట్ గా మహేష్ ఓ యాడ్ షూట్లో భాగంగా ఇలా కనిపించారని తెలుస్తుంది. మరోవైపు మహేష్ గుంటూరు కారం చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

అయితే అనుకున్న సమయానికి షూటింగ్ జరగని నేపథ్యంలో 2024 జనవరికి రావడం కష్టమే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లను చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఖండించారు. చెప్పినట్లు సంక్రాంతికి గుంటూరు కారం విడుదల అవుతుందని గట్టిగా చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.