Mahesh Babu Rajamouli Movie: టాలీవుడ్ వర్గాల్లో అదిరిపోయే న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి అదే నిజమైతే సంచలన కాంబో అవుతుంది. దర్శకధీరుడు రాజమౌళి గురించి తెలిసిందే. ఆయన ఏదైనా అనుకున్నారంటే సాధించి తీరుతారు. నందమూరి-మెగా హీరోలు కలిసి మల్టీస్టారర్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఫ్యాన్ రైవల్రీ నేపథ్యంలో అది ఎన్నటికీ సాధ్యం కాదనుకున్నారు. కానీ రాజమౌళి సాకారం చేసి చూపారు. మూవీ విడుదలయ్యాక మావాడు గొప్పంటే మావాడు గొప్పంటూ తన్నుకున్నప్పటికీ ఒక భారీ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి సందడి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్-చరణ్ సొంత అన్నదమ్ముల మాదిరి మెలిగారు. ఒకరిపై మరొకరు ఎనలేని ఆప్యాయత కనబరుచుకున్నారు. ఆ క్రెడిట్ అంతా రాజమౌళికే ఇవ్వాలి. కాగా అలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ మరొకటి సెట్ చేయబోతున్నారట. ఇద్దరు స్టార్ కిడ్స్ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో లాంచ్ కాబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించిన రాజమౌళి నెక్స్ట్ మహేష్ తో మూవీ ప్రకటించారు. అది హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉండనుందని సమాచారం. కాగా ఈ మూవీలో రెండు కీలకమైన చైల్డ్ రోల్స్ ఉన్నాయట. ఆ పాత్రలకు సితార ఘట్టమనేని, అభిరామ్ నందమూరిలను ఎంచుకున్నాడట. అంటే మహేష్ కూతురు, ఎన్టీఆర్ కొడుకు ఓకే చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్నారట.
మహేష్-రాజమౌళి మూవీలో దాదాపు 15 నిమిషాల నిడివి కలిగిన ప్రారంభం సన్నివేశాలు ఉంటాయట. అవి అక్కాతమ్ముడు పాత్రల మీద నడుస్తాయట. ఆ పాత్రలను సితార, అభిరామ్ లతో చేయించాలనేది రాజమౌళి ఆలోచనట. మరి ఆయన అనుకుంటే కాదనేది ఏముంది. అందులోనూ అది మహేష్ మూవీ. కాబట్టి మహేష్ కి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇక ఎన్టీఆర్ తో రాజమౌళి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి అడిగితే ఎన్టీఆర్ నో చెప్పడం జరగని పని. ఒక సినిమాలో ఇద్దరు స్టార్ కిడ్స్ నటించే అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుందని తెలుస్తుంది.