Mahesh Babu Daughter Sitara: బుల్లి తెరలపై రియాల్టీ షోలు సందడి చేస్తున్నాయి.. ప్రేక్షకులు కూడా వీటినే ఆదరిస్తున్నారు. సీరియళ్లతో పోల్చితే టీవీ రేటింగ్స్ షోలకే ఎక్కుగా వస్తున్నాయి. దీంతో చానెళ్లు రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తాజాగా జీ తెలుగు డాన్స్ ఇండియా డాన్స్ పేరుతో మరో కొత్త షో ప్రారంభించింది. ఇప్పటికే అనేక రియాలిటీ షోలతో సినీ పరిశ్రమకు సరికొత్త గాయనీ గాయకులను, అనేక మంది కొరియోగ్రాఫర్లను అందించి మంచి పేరు సంపాదించింది జీ తెలుగు. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న చానెల్ యాజమాన్యం ఇప్పుడు ఒక సరికొత్త డాన్స్ రియాలిటీ షోతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘డాన్స్ ఇండియా డాన్స్’ తెలుగు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ ప్రోగ్రాం లేటెస్ట్ ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ మహేశ్‌బాబు తన కుమార్తె సీతారతో కలిసి సందడి చేశారు. కుమార్తెతో కలిసి మహేశ్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. సితార కూడా తన ముద్దుముద్దు మాటలతో చర్చ చేసింది. అక్కడ ఉన్న డ్యాన్సర్ లతో కాలు కదిపింది. దీంతో మహేశ్ అభిమానులు ఈ ఎపిసోడ్‌ను మళ్లీమళ్లీ చూస్తున్నారు.

మొదటిసారి రియాలిటీ షోలో ప్రిన్స్..
సూపర్‌స్టార్, ప్రిన్స్ మహేశ్‌బాబు ఒక టీవీచానెల్ రియాలిటీ షోలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇందులో తన కూతురుతో పాల్గొనడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 4న(ఆదివారం) ప్రసారమైన ఈ షోలో మహేశ్‌బాబు తనదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. తండ్రికి తగ్గ తనయ అన్నట్లుగా సితారా కూడా నాన్నతో చేసిన అల్లరి ప్రేక్షకులను కట్టిపడేసి ఎపిసోడ్ కే హైలైట్‌గా నిలిచింది.
డాన్స్ అంటే సితారకు ఇష్టం..
డాన్స్‌పై సితారకు మొదటి నుంచి మక్కువ ఎక్కువ. ఇదే ఆమె ‘డాన్స్ ఇండియా డాన్స్’ షోకు రావడానికి కారణమైంది. ఈ విషయాన్ని
మహేశ్‌బాబే స్వయంగా చెప్పారు. మొదటిసారి కూతురితో కలిసి ఒక టీవీ షోలో కనిపించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇది ఎప్పటికి మరిచిపోలేని ఒక స్పెషల్ మూమెంట్ అన్నారు. ఈ షో కి తమను ఆహ్వానించిన ‘జీ తెలుగు’ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. సితార కూడా షోలో తన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ‘నేను ఒక టీవీ షో స్టేజ్‌పై రావడం ఇదే మొదటిసారి. నాన్న నా పక్కన ఉండటం వల్ల ఎంతో సాఫీగా సాగింది. నాకు డాన్స్ అంటే ఎంతో ఇష్టం, కంటెస్టెంట్స్ పెరఫార్మన్సెస్ నాకు ఎంతో స్ఫూర్తిని కల్పించాయి. నా మొదటి టీవీ షో ఎక్సీ్పరియన్స్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా. నన్ను డాన్స్ ఇండియా డాన్స్ కి తీసుకువచ్చిన నాన్నకి స్పెషల్ థాంక్స్’ అని చెప్పుకొచ్చింది.

డాన్స్ అంటే సెలబ్రేషన్..
ఈ షోలో కంటెస్టెంట్స్‌ను ఎంకరేజ్ చేసేలా డాన్స్ గురించి మహేశ్‌బాబు మాట్లాడారు. డాన్స్ అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కాదని తనకు తెలిసి డాన్స్ అంటే ఒక సెలబ్రేషన్ అన్నారు. టాలెంట్ ఉండి సరైన వేదిక దొరికితే డాన్స్ ఎక్కడ చేసినా ఒక పండుగలా ఉంటుందని పేర్కొన్నారు. ఇక చిన్నారి కంటెస్టెంట్స్ రిషిత్ సుహానా మహేశ్‌బాబు ‘మైండ్‌బ్లాక్’ పాటకు రచ్చ చేశారు. ఈ డాన్స్ పర్సార్మెన్స్ తర్వాత మహేశ్‌బాబే ఆశ్చర్యపోయారు. చిన్నారుల టాలెంట్‌తో తన మైండ్ బ్లాక్ అయింది అంటూ కామెంట్‌చేసి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక సితార కూడా తన మైండ్ బ్లాక్ అయితుంది అని రిషిత్, సుహానాను ఎంకరేజ్ చేసింది. ఇక చిన్నారి కంటెస్టెంట్ సుహానా తన పర్షార్మెన్స్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని డైలాగ్స్‌తో చేసిన యాక్షన్ అటు మహేశ్‌బాబుతోపాటు ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తండ్రి కూతురు సుహానా డైలాగ్స్ చూసి ముసిముసిగా నవ్వారు.ఇక సుహానా ‘ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఏముంది’ అని మహేశ్‌బాబును అడిగిన ప్రశ్న కూడా ఆలోచింపజేసింది. దీనికి యాంకర్ ఐ ఉందని సమాధానం చెప్పగా సుహానా కాదు అండ్ ఉందని సమాధానం చెప్పడంతో మహేశబాబు అయ్యబాబోయ్ అనడంతో నవ్వులు పూశాయి. ఇక చెర్రీ – భూమిక ‘మధురమే ఈ గానమే’ అనే పాటకు చేసిన డ్యాన్స్ సెగలు రేపింది. వీరి టాలెంట్ కూడా ఆకట్టుకుంది. భూమిక మహేశ్‌పై చేసిన కామెంట్.. మహేశ్‌ను టచ్ చేయడం, సితార కూడా తనను హగ్‌చేసుకోవాలని కోరడం రచ్చరచ్చగా మారింది. మత్స్యకారులు బాబు కుమార్ చేసిన డాన్స్‌కు మహేశ్ ఫిదా అయ్యారు. తాను చేసే సినిమాలో కానీ, తీసే సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక జబర్దస్త్ కంటెస్టెంట్ వర్షిణి చేసిన పూరి హంగామా నవ్వులు పూయించింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ జీ తెలుగు చానెల్‌కు క్రేజ్ తెచ్చిందని చెప్పవచ్చు.