Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu : SSMB 29, మహేష్ బాబు లుక్ లీక్, సింహంలా ఉన్న సూపర్...

Mahesh Babu : SSMB 29, మహేష్ బాబు లుక్ లీక్, సింహంలా ఉన్న సూపర్ స్టార్! వైరల్ వీడియో

Mahesh Babu : మహేష్ బాబు-రాజమౌళి కెరీర్లో మొదటిసారి చేతులు కలిపారు. ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ ఫేమ్ రాబట్టిన రాజమౌళి SSMB 29 చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు అని సమాచారం. ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ విషయాన్ని రాజమౌళితో పాటు కథా రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. మహేష్ బాబు పాత్ర ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా ఉంటుందట. మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారు. ఒకప్పటి బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రాలు చేస్తున్న క్రమంలో రాజమౌళి ఆమెకు అవకాశం ఇచ్చారు.

Also Read : మహేష్ బాబు రామ్ చరణ్ ఇద్దరిలో కనిపించే కామన్ ఎలిమెంట్ ఏంటంటే..?

SSMB 29 చిత్రీకరణ ఈ ఏడాది ఆరంభంలో మొదలైంది. చాలా రహస్యంగా చిత్రీకరణ సాగుతుంది. హైదరాబాద్ శివారులో గల అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారని సమాచారం. SSMB 29 పూజా కార్యక్రమం కూడా గుట్టుగా పూర్తి చేశారు. మీడియాను అనుమతించలేదు. ఎలాంటి ఫోటోలు బయట పెట్టలేదు. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్రికా అడవుల్లో అని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇక మహేష్ బాబు ఇటీవల బయటకు రావడం మానేశారు. ఆయన లుక్ రివీల్ కాకూడదు అనేది కూడా ఇందుకు కారణం. ఇటీవల దుబాయ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు నమ్రత, సితార హాజరయ్యారు. మహేష్ ఇండియాలోనే ఉండి పోయారు. రాజమౌళి తన హీరోల లుక్ రహస్యంగా ఉండాలని కోరుకుంటారు. సెట్స్ నుండి కూడా ఎలాంటి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. రాజమౌళికి షాక్ ఇస్తూ మహేష్ బాబు లుక్ లీకైంది.

మహేష్ బాబు SSMB 29కోసం చాలా మేకోవర్ అయ్యారు. దానిలో భాగంగా జిమ్ లో గంటల తరబడి కష్టపడుతూ కండలు పెంచుతున్నాడు. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న మహేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాగా పెరిగిన జుట్టు, గడ్డంతో మహేష్ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మా హీరో సింహం వలె ఉన్నాడంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా మహేష్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దాదాపు మూడేళ్లు మహేష్ బాబు-రాజమౌళి ఈ చిత్రం కోసం పని చేయనున్నారని సమాచారం.

Also Read : ఆ విషయం లో మహేష్ బాబు చాలా వీక్…మరి రాజమౌళి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో చూడాలి…

RELATED ARTICLES

Most Popular