https://oktelugu.com/

Mahesh Trivikram Movie: మహేష్ బాబు’ మరదలిగా ప్రముఖ హీరో కుమార్తె

Mahesh Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని వార్తలు రాగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో ఈ సినిమాలో నటీనటుల విషయంలో కూడా త్రివిక్రమ్ అట్టహాసంగా ప్లాన్ చేయాల్సి వస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ను ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 11, 2022 / 03:43 PM IST
    Follow us on

    Mahesh Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని వార్తలు రాగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో ఈ సినిమాలో నటీనటుల విషయంలో కూడా త్రివిక్రమ్ అట్టహాసంగా ప్లాన్ చేయాల్సి వస్తోంది.

    Shivatmika

    తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ను ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో మహేష్ మరదలిగా శివాత్మిక రాజశేఖర్ ఎంపిక అయిందట. మరోవైపు శివాత్మిక రాజశేఖర్ మెయిన్ లీడ్ గా ఓ సినిమా చేస్తూ బిజీగా ఉందామె. అయితే, మహేశ్ సినిమాలో ఈ యంగ్ బ్యూటీ నటిస్తే.. ఆ క్రేజే వేరు. కాగా ఈ పాన్ ఇండియా సినిమా పై ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

    Also Read:  ఏపీ & తెలంగాణ బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

    ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి త్రివిక్రమ్, శివాత్మిక రాజశేఖర్ ను కూడా రంగంలోకి దించుతున్నాడు. సహజంగా త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో తన అభిరుచికి తగ్గట్టు నటీనటులను ఎంపిక చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన ప్రతి సినిమాలో హీరోయిన్ కి సిస్టర్ పాత్రను యాడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే మెయిన్ హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ పూజా హెగ్డేను ఫైనల్ చేశాడు. ఇప్పుడు ఆమె చెల్లి పాత్రలో శివాత్మిక రాజశేఖర్ ను ఖరారు చేశాడు.

    Trivikram-Mahesh

    ఇక ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారని గతంలో అనేక వార్తలు వచ్చాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి మొదలుకానుంది.

    Also Read:  శ్రుతి హాసన్ అక్కడ కూడా ప్లాన్ చేసుకుంటుంది

    Tags