#SSMB28Glimpse : మహేష్ – త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ టీజర్ డైలాగ్ వీడియో లీక్..’రేయ్ జగ్గు’ అంటూ మహేష్ ఊర మాస్ డైలాగ్!

మహేష్ బాబు స్టైల్ గా కార్ దిగి సిగరెట్ కాల్చుకుంటూ నడవడాన్ని చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు మేము ఎలాంటి మహేష్ బాబు ని చూడాలనుకున్నామో అలాంటి మహేష్ బాబు ని చూపించినందుకు ధన్యవాదాలు

Written By: NARESH, Updated On : May 25, 2023 7:37 pm
Follow us on

#SSMB28Glimpse : సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొంత కాలం నుండి విరామం లేకుండా షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాత్కాలికంగా నిలిచిపోయింది. జూన్ 2 వ తేదీ నుండి సరికొత్త షెడ్యూల్ ప్రారంభం అవ్వబోతుందని టాక్. అయితే మే 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ఒకటి విడుదల చెయ్యబోతున్నారు.

దీనికి సంబంధించిన ఒక షూటింగ్ వీడియో సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారిపోయింది. మహేష్ బాబు స్టైల్ గా కార్ దిగి సిగరెట్ కాల్చుకుంటూ నడవడాన్ని చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు మేము ఎలాంటి మహేష్ బాబు ని చూడాలనుకున్నామో అలాంటి మహేష్ బాబు ని చూపించినందుకు ధన్యవాదాలు అంటూ ఫ్యాన్స్ త్రివిక్రమ్ కి చెప్తున్నారు.

 

అయితే ఈ నెల 31 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే గ్లిమ్స్ కి సంబంధించిన డైలాగ్ ఇదే అంటూ సోషల్ మీడియా లో ప్రచారం సాగుతుంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో ఒకసారి చూద్దాము. ముందుగా విలన్ జగపతి బాబు మాట్లాడుతూ ‘రేయ్ ఏంట్రా బీడీ తాగుతూ న ఇంట్లోకే వచ్చావ్’ అని అంటాడు. అప్పుడు మహేష్ బాబు ‘రేయ్.. రేయ్.. జగ్గు బీడీ ఇపోలోపు మార్కెట్ కు.. వెళ్లి క్షమించమని అడుగు లేదా ఇప్పుడే ఎర్రకారం తిని వచ్చా .. పల్నాడు నడిబొడ్డున పండబెట్టి పాతేస్తా’ అని పవర్ ఫుల్ డైలాగ్ కొడుతాడు. గ్లిమ్స్ వీడియో లో ఇదే డైలాగ్ ఉంటుందట.

మహేష్ ని ఇంత ఊర మాస్ యాంగిల్ లో చూసి చాలా కాలమే అయ్యింది. ‘ఖలేజా’ చిత్రం తో సరికొత్త మహేష్ బాబు ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన త్రివిక్రమ్ , ఈ ‘గుంటూరు కారం’ చిత్రం తో మహేష్ లోని మరో కొత్త యాంగిల్ బయటకి తీసినట్టు సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.