https://oktelugu.com/

నిహారిక కు చిరంజీవి కాస్ట్లీ గిఫ్ట్… ఏకంగా కోట్లలో..!

నేడు సాయంత్రం నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరగనుంది. నిహారిక వివాహానికి రాజస్థాన్ లోని ప్రముఖ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదిక కాగా, మెగా ఫ్యామిలీ మొత్తం రెండు రోజుల క్రితమే అక్కడకు చేరుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలలో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొంటున్నారు. చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్ లతో పాటు మెగా హీరోలందరూ ఖరీదైన ఫంక్షన్ వేర్ లో మెరిసిపోతున్నారు. చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న […]

Written By:
  • admin
  • , Updated On : December 9, 2020 / 10:03 AM IST
    Follow us on


    నేడు సాయంత్రం నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరగనుంది. నిహారిక వివాహానికి రాజస్థాన్ లోని ప్రముఖ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదిక కాగా, మెగా ఫ్యామిలీ మొత్తం రెండు రోజుల క్రితమే అక్కడకు చేరుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలలో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొంటున్నారు. చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్ లతో పాటు మెగా హీరోలందరూ ఖరీదైన ఫంక్షన్ వేర్ లో మెరిసిపోతున్నారు. చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న అతిపెద్ద వేడుకను అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు.

    Also Read: విలక్షణ నటుడు నుండి మళ్లీ ‘బ్లఫ్ మాస్టర్’ ?

    పెళ్లికూతురు నిహారికకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన వెడ్డింగ్ గిఫ్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. చిరంజీవి తన స్థాయికి తగ్గట్టుగా కూతురు నిహారికకు ఒక వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చారట. ఆ వజ్రాల హారం ధర ఏకంగా రెండు కోట్ల రూపాయలు అని తెలుస్తుంది. మెగా కుటుంబంలోని పిల్లలందరినీ సమానంగా ఆదరించే చిరంజీవి, నిహారికకు విలువైన గిఫ్ట్ ఇచ్చిన, ఆమె పట్ల తన ప్రేమ చాటుకున్నారు. నిన్న సోషల్ మీడియాలో చిరు ఓ అరుదైన ఫోటో పంచుకున్నారు. రెండేళ్ల వయసులో ఉన్న నిహారికకు ఎత్తుకున్న చిరు, ఆ ఫొటోతో పాటు ” మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యూ’ అంటూ బోవోద్వేగ కామెంట్ పెట్టారు.

    Also Read: మహేష్ ‘సర్కారు వారి..’ కథ అదే !

    పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నిన్న సాయంత్రం ఉదయ్ పూర్ చేరుకున్నారు. పవన్ తన కొడుకు అకీరాతో కలిసి ఈ వేడుకకు హాజరు కావడం విశేషం. పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరియు పిల్లలు అకీరా, ఆద్యలకు ఆహ్వానం ఉందా లేదా అనుకుంటున్న తరుణంలో అకీరా హాజరై అనుమానాలు నివృత్తి చేశాడు. పవన్ రాకతో పెళ్లి వేడుక మరింత సందడిగా మారింది. పెదనాన్న చిరు రెండు కోట్ల రూపాయల విలువైన బహుమతి ఇవ్వగా, బాబాయ్ పవన్ ఎంత ఖరీదైన బహుమతి నిహారికకు ఇస్తాడో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్