Mahesh Reaction on Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ప్రభాస్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని ప్రభాస్ నిరూపించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ‘రాధేశ్యామ్’ సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేస్తూ.. ‘రాధేశ్యామ్’ తిరుగులేని విజయం అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. నిజంగా ఇది ప్రభాస్ స్టార్ డమ్ కి కొలమానమే. అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఫైనల్ గా బాక్సాఫీస్ సౌండ్ అదిరిపోయింది’ అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.
Also Read: భీమ్లా నాయక్’ పాటల జ్యూక్ బాక్స్ రిలీజ్
మహేష్ – ప్రభాస్ మధ్య మంచి స్నేహం ఉంది. అయితే, గతంలో ఎన్నడూ ఇలా మహేష్.. ప్రభాస్ సినిమా గురించి పొగడలేదు. కానీ, మొదటసారి మహేష్ బాబు ఇలా ఓపెన్ అయ్యిపోవడం మహేష్ ఫ్యాన్స్ ను కూడా షాక్ కి గురి చేసింది. మహేష్ ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ.. ప్రభాస్ తో పాటు పూజా కూడా హార్ట్ టచింగ్ ఫెర్మామెన్స్ ఇచ్చిందని మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇక ‘రాధేశ్యామ్’ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ అందించిన మ్యూజిక్ కూడా టాప్ లో ఉందని.. దర్శకుడు రాధాకృష్ణ మిగతా టీమ్ అద్భుతంగా పని చేశారు అని.. ముఖ్యంగా జగపతిబాబు గారు కూడా అద్భుతంగా నటించారని మహేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ కామెంట్స్ పై ప్రేక్షకులు మీకులాగే చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్’ అలా చూస్తే కిక్కు ఏముంటుంది.. ఇలా చూడండి
[…] Radhe Shyam: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదల కాబోతోంది. దీనిపై అందరికి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడేళ్ల క్రితం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటించిన ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ తో అభిమానులను పలకరించనున్నాడు. దీంతో సినిమా కోసం అభిమానులు వేచి ఉన్నారు. బాహుబలితో క్రేజీ సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమాలో ఏమేరకు ఆకట్టుకోనున్నాడో చూడాల్సిందే. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేశారు. దాదాపు ఏడు వేల థియేటర్లలో రాధేశ్యామ్ ఆడనుంది. […]
[…] Radhe Shyam Movie Political Leaders AP: తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక అంశంలో పరిశ్రమలో గొడవలు సాగుతూనే ఉంటాయి. గతంలో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలతో ప్రభుత్వానికి సినిమాకు మధ్య అగాధం పెరిగిపోయింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ సినిమా పరిశ్రమపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. సినిమా టికెట్ల విషయంలో కలుగజేసుకుని ధరలు తగ్గించడంతో పరిశ్రమ వర్గాలకు జగన్ కు మధ్య దూరం పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కలుగజేసుకుని పెద్దన్న పాత్ర పోషించినా సమస్య కొలిక్కి రాలేదు. పవన్ కల్యాణ్ సినిమాలను టార్గెట్ చేసుకుంటూనే ఉండటం గమనార్హం. వకీల్ సాబ్ తో మొదలైన వివాదం భీమ్లా నాయక్ వరకు కొనసాగింది. […]
[…] Prabhas Fans Iin Radhe Shyam Movie: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాధేశ్యామ్ నేడు భారీ స్థాయిలో రాధేశ్యామ్ విడుదల అయ్యింది. నిన్న రాత్రి కొన్ని చోట్ల ప్రివ్యూ షోస్ వేశారు. ఈ క్రమంలో ఎప్పుడూ దక్షిణాది నటులు, వారి చిత్రాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే కమల్ ఆర్ ఖాన్, రాధేశ్యామ్ ని చూసి హిట్ టాక్ నిచ్చేశాడు. మొదటి సగం బ్రిల్లియంట్ అని, రెండో సగం మొదటి సగం అంతకాకపోయినా బావుందన్నాడు, చిత్రం కచ్చితమైన హిట్ అన్నాడు. […]