Mahesh Rajamouli movie update: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) ప్రాజెక్ట్ అనధికారికంగా మొదలై చాలా రోజులే అయ్యింది. ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. మూడవ షెడ్యూల్ కి సమ్మర్ హాలిడేస్ కారణంగా కొంత గ్యాప్ ఇచ్చారు. ముందుగా కెన్యా లో షూటింగ్ చెయ్యాలని అనుకున్నారు కానీ, అక్కడ పరిస్థితులు ప్రస్తుతం అనుకూలించకపోవడం తో ఆ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మూడవ షెడ్యూల్ ని దక్షిణాఫ్రికా ప్రాంతం లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎతైన కొండల్లో ఈ షూటింగ్ కార్యక్రమాలు జరగనుంది. అందుకు సంబంధించిన జాగ్రత్తలు కూడా ఇప్పటి నుండే తీసుకుంటున్నారట. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ నే వ్యవహరిస్తున్నదని చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Also Read: మీడియం రేంజ్ హీరోలకు భవిష్యత్తు లేనట్టేనా..? లేటెస్ట్ గణాంకాలు ఏమి చెప్తున్నాయంటే!
ఇందులో కొత్తేమి ఉంది, రాజమౌళి ప్రతీ భారీ బడ్జెట్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఆయనే పని చేస్తున్నాడు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకు ఆయన పని చేయడం లేదు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపాడు. సోషల్ మీడియా లో తానూ మహేష్, రాజమౌళి సినిమా కోసం పనిచేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమా కోసం రాజమౌళి మొత్తం కొత్తవాళ్ళకే అవకాశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. నాతో పాటు ఇన్ని రోజులు ఆయన తో కలిసి నడిచిన ఎంతో మంది ఈ చిత్రానికి పని చేయడం లేదు. ఇంతకు మించి వివరాలను అందించలేను అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి ఇంత కాలం తన విజన్ కి తగ్గ సినిమాలు చేస్తూ వచ్చాడంటే అందుకు కారణం మొదటి నుండి తనతో పని చేసిన టీం అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.
Also Read: ఓవర్సీస్ లో మొదలైన ‘కింగ్డమ్’ అడ్వాన్స్ బుకింగ్స్..విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్స్ ఇవే!
వటవృక్షం లాంటి ఈ రాజమౌళి టీం లో కొత్త వాళ్లకు చోటు ఇవ్వడం కాస్త రిస్క్ ఏమో? అని అభిమానులు భయపడుతున్నారు. కానీ రాజమౌళి తన టీం ని మార్చుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు, అలాంటి ఆయన ఈ సినిమా కోసం కొంతమంది కొత్త టెక్నీషియన్స్ ని ఎంచుకున్నదంటే కచ్చితంగా ఎదో మ్యాటర్ ఉండే ఉంటుంది. ఆయన విజన్ ని అనుమానించాల్సిన అవసరమే లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం హీరోయిన్ గా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తుందని ఇంతకాలం అంతా అనుకున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. ఇందులో ఆమె పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటిస్తుందని , పృథ్వీ రాజ్ సుకుమారన్ ఆమె జోడి అని అంటున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే ఈ విషయం పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.