Mahesh Rajamouli Movie: మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి అభిమానులు, ప్రేక్షకులు ఎంత అయితే ఊహించుకుంటారో, అంతకు మించి పది రెట్లు ఈ సినిమా ఉండబోతుంది. అసలు కలలో కూడా ఊహించని అద్భుతాలు ఈ సినిమా తో సృష్టించబోతోంది ఈ క్రేజీ కాంబినేషన్. #RRR చిత్రం తో హాలీవుడ్ లో రాజమౌళి తన బలమైన పాద ముద్ర వేశాడు. అక్కడితో ఆగిపోకుండా, ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న చిత్రాన్ని హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గానే కెన్యా లో ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఒక క్రేజీ అప్డేట్ నిన్న సోషల్ మీడియా లో రావడం తో, మహేష్ బాబు ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు. ఇది కదరా మా మహేష్ రేంజ్ కి తగ్గ ఫలితం రాబోతుండడం అంటే అని అభిమానులు మురిసిపోతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?
ప్రముఖ హాలీవుడ్ సంస్థలు అయినటువంటి డిస్నీ మరియు సోనీ పిక్చర్స్ రాజమౌళి టీం తో గత కొద్దిరోజులుగా చర్చలు జరుపుతున్నారట. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఈ క్రేజీ చిత్రాన్ని అన్ని దేశాల భాషల్లో డబ్ చేసి గ్రాండ్ గా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాయి ఈ రెండు హాలీవుడ్ సంస్థలు. దాదాపుగా 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు అవతార్ , ఎవెంజర్స్ వంటి చిత్రాలు కూడా ఈ రేంజ్ లో రిలీజ్ అవ్వలేదు. అవతార్ 2 చిత్రం 77 దేశాల్లో విడుదల అవ్వగా, ఎవెంజర్స్ ఎండ్ గేమ్ అనే చిత్రం 84 దేశాల్లో విడుదలైంది. ఇప్పుడు ఆ రెండు సినిమాలకంటే అదనంగా మరో 40 దేశాల్లో మహేష్, రాజమౌళి చిత్రం విడుదల కాబోతుంది. ఎప్పుడో రెండేళ్ల తర్వాత విడుదల అవ్వబొయే సినిమాకు ఇప్పటి నుండే బలమైన గ్రౌండ్ ని సిద్ధం చేస్తున్నాడు రాజమౌళి.
ఈ చిత్రానికి ‘జెన్ 63’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. అంటే శ్రీరాముడి కుటుంబానికి సంబంధించి 63 వ తరానికి చెందిన వాడిగా ఇందులో మహేష్ బాబు కనిపించబోతున్నాడు అన్నమాట. విలన్ క్యారక్టర్ తీవ్రమైన అనారోగ్యానికి గురై వీల్ చైర్ కి పరిమితం అవుతాడు. ఆయన రోగాన్ని నయం చేయాలంటే మృత సంజీవని కావాలి. ఆ సంజీవని సామాన్య మానవులకు దొరికేది కాదు. శ్రీరాముడి వంశస్తుడు అయినటువంటి హీరో క్యారక్టర్ కి మాత్రమే ఆ సంజీవని ని తెచ్చే సత్తా ఉంటుంది. అలా హీరోని బలవంతంగా విలన్ వద్దకు తీసుకొస్తారు. ఆ తర్వాత సంజీవని కోసం హీరో క్యారక్టర్ చేసే ప్రయాణం,మధ్యలో ఆయనకు ఎదురయ్యే అడ్వెంచర్ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.