Pawan Kalyan And Allu Arjun: చాలా కాలం నుండి మెగా ఫ్యామిలీ కి మరియు అల్లు ఫ్యామిలీ కి మధ్య సరిగా సఖ్యత లేదని, అల్లు అర్జున్ వైసీపీ పార్టీ కి చెందిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి కుమార్ కోసం నంద్యాల కి వెళ్లినప్పటి నుండి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయిందని, ఇలా మీడియా లో ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ మాత్రమే అని ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నో సందర్భాల్లో కొట్టిపారేశారు. రీసెంట్ గా అల్లు కనకరత్నమ్మ చనిపోయినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం దగ్గరుండి ఆమె అంత్యక్రియలను జరిపించడం తో పాటు, అల్లు కుటుంబానికి అండగా నిలబడి వాళ్లకు ధైర్యం చెప్తూ సంతాపం ని వ్యక్తం చేయడం వంటివి చూసిన తర్వాత వీళ్లంతా ఎప్పటికీ ఒక్కటే, కష్టసమయం వచ్చినప్పుడు అంతా ఇలా కలిసిపోతారు అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభ కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు కానీ, సభ ముగిసిన తర్వాత నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి, ఆ కుటుంబం మొత్తానికి తన సంతాపం ని వ్యక్తం చేసాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అంటే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి పెద్దగా ఇష్టం లేదేమో అనే భావన నిన్న ట్విట్టర్ లో డిప్యూటీ సీఎం హ్యాండిల్ నుండి పడిన ట్వీట్స్ ని చూసి అభిమానులకు అనుమానం కలిగింది. వాస్తవానికి నిన్న సెలబ్రిటీలలో అందరికంటే ముందు అల్లు అర్జున్ నే పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇరువురి హీరోల అభిమానులు సర్ప్రైజ్ కి గురై కలిసిపోయారు కూడా. అల్లు అర్జున్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి వారు శుభాకాంక్షలు తెలియజేసారు.
రాత్రి సమయం లో పవన్ కళ్యాణ్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చాడు. అందరికి ఆయన రిప్లై ఇచ్చిన తీరు వేరు, అల్లు అర్జున్ కి రిప్లై ఇచ్చిన తీరు వేరు. ఉదాహరణకు రామ్ చరణ్ కి ఎలాంటి రిప్లై ఇచ్చాడంటే ‘డియర్ రామ్ చరణ్..నీ విషెస్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు. నువ్వు రాబోయే రోజుల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, నీ కష్టానికి తగ్గ ఫలితాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరి లాగానే నేను కూడా పెద్ది చిత్రం కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అల్లు అర్జున్ కి మాత్రం ‘డియర్ బన్నీ..థాంక్యూ వెరీ మచ్’ అని మాత్రమే చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ కి చెప్పినట్టుగా భవిష్యత్తులో నువ్వు సక్సెస్ లను అందుకోవాలి అనే పదాలను జత చేసి ఉండొచ్చు కదా అని పవన్ అభిమానులు సైతం అడుగుతున్నారు. ఈ ఒక్క ట్వీట్ తోనే చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ కి ఎందుకో అల్లు అర్జున్ అంటే ఈమధ్య కాలం లో ఇష్టం పోయింది అని అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Dear @AlwaysRamCharan, thank you for the warm wishes. Wishing you greater heights for the hard work and dedication you always put in. Can’t wait to see you shine on the screen brighter with #Peddi. https://t.co/hnhOvFgVyh
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 2, 2025