https://oktelugu.com/

Mahesh: మహేష్ మంచి మనసు… మల్టీస్టారర్స్ చేస్తాడట

Mahesh: ఒకప్పుడు టాలీవుడ్ మల్టీస్టారర్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉండేది. తెలుగు సినిమా రెండు కళ్లుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్ పదుల సంఖ్యలో కలిసి చిత్రాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. వీరి తర్వాత స్టార్స్ గా ఎదిగిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా మల్టీస్టారర్స్ చేయడం జరిగింది. చిరు, బాలయ్య, నాగ్, వెంకీల జనరేషన్ నాటికి మల్టీస్టారర్స్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 7, 2021 / 12:17 PM IST
    Follow us on

    Mahesh: ఒకప్పుడు టాలీవుడ్ మల్టీస్టారర్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉండేది. తెలుగు సినిమా రెండు కళ్లుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్ పదుల సంఖ్యలో కలిసి చిత్రాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. వీరి తర్వాత స్టార్స్ గా ఎదిగిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా మల్టీస్టారర్స్ చేయడం జరిగింది. చిరు, బాలయ్య, నాగ్, వెంకీల జనరేషన్ నాటికి మల్టీస్టారర్స్ కి బ్రేక్ పడింది.

    Mahesh NTR

    అయితే మరలా ఆ ట్రెండ్ టాలీవుడ్ లో ఊపందుకుంటుంది. నందమూరి-కొణిదెల వంశాలకు చెందిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఈ మధ్య కాలంలో వస్తున్న అతిపెద్ద మల్టీస్టారర్ గా చెప్పవచ్చు. అయితే భవిష్యత్ లో టాప్ స్టార్స్ మధ్య మరిన్ని మల్టీస్టారర్స్ తెరకెక్కే అవకాశం కలదని సూపర్ స్టార్ మహేష్ భరోసా ఇచ్చారు. ఇటీవల ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోలో పాల్గొన్న మహేష్ ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశారు.

    నాతో మల్టీస్టారర్ ఎప్పుడు చేస్తున్నావ్ అన్నా… అని ఎన్టీఆర్ అడుగగా, మన మధ్య ఒకసారి డిస్కషన్ జరిగింది. తర్వాత నువ్వు నేను బిజీ అయ్యాం. ఖచ్చితంగా మల్టీస్టారర్ చేద్దాం అని మహేష్ అన్నారు. మహేష్ ఇంకా మాట్లాడుతూ, ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న స్టార్స్ మధ్య హెల్తీ రిలేషన్ కొనసాగుతుంది. ఒకరితో మరొకరు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో తెలుగు ప్రేక్షకులు చాలా మల్టీస్టారర్స్ చూడబోతున్నారని తెలియజేశారు.

    Also Read: Akhanda: అఖండ ఉత్సాహంతో బోయపాటితో చిరు కాంబోకు ప్లాన్​?

    మంచి కథలు దొరికితే మల్టీస్టారర్స్ చేయడానికి సిద్ధమని పరోక్షంగా మహేష్ సమ్మతి తెలిపారు. వెంకటేష్ తో మహేష్ చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. బెస్ట్ మల్టీస్టారర్స్ లో ఒకటిగా ఉంది. ఇక పవన్-మహేష్ కలిసి ఓ మూవీ చేస్తే చూడాలనేది సినీ ప్రియుల ఆకాంక్ష. అయితే భవిష్యత్ లో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చవచ్చు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ తో కూడిన మల్టీస్టారర్స్ సెట్స్ పైకి వెళ్ళవచ్చు. స్టార్స్ తో మల్టీస్టారర్స్ చేయగల టాలెంటెడ్ డైరెక్టర్స్ పరిశ్రమలో ఉన్నారని ఎన్టీఆర్ చెప్పడం విశేషం. మరి చూద్దాం మహేష్, ఎన్టీఆర్ మాటలు ఎంత వరకు నిజం అవుతాయో.

    Also Read: Priyanka Jawalkar: రెచ్చిపోతాను మహాప్రభో… ఎలా కావాలి అంటే అలా చేస్తాను !

    Tags