https://oktelugu.com/

Akhanda Collections: ‘అఖండ’కు అసలు పరీక్ష.. ఐదో రోజు కలెక్షన్ ఎంతంటే?

Akhanda Collections: నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’. ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. టాలీవుడ్లో ‘అఖండ’ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రికార్డులపై కన్నేసింది. బాలయ్య కెరీర్లోనే అత్యంత వేగంగా రూ.50కోట్లు కలెక్షన్ సాధించిన తొలి చిత్రంగా ‘అఖండ’ నిలిచిపోయింది. గత నాలుగు రోజుల్లో ఈ ఫీట్ అందుకున్న ‘అఖండ’కు సోమవారం నుంచే అసలు పరీక్ష మొదలైంది. ‘అఖండ’ విడుదలైన మొదటి రోజు, రెండో రోజు అభిమానులు థియేటర్లకు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2021 / 12:20 PM IST
    Follow us on

    Akhanda Collections: నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’. ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. టాలీవుడ్లో ‘అఖండ’ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రికార్డులపై కన్నేసింది. బాలయ్య కెరీర్లోనే అత్యంత వేగంగా రూ.50కోట్లు కలెక్షన్ సాధించిన తొలి చిత్రంగా ‘అఖండ’ నిలిచిపోయింది. గత నాలుగు రోజుల్లో ఈ ఫీట్ అందుకున్న ‘అఖండ’కు సోమవారం నుంచే అసలు పరీక్ష మొదలైంది.

    Akhanda Collections

    ‘అఖండ’ విడుదలైన మొదటి రోజు, రెండో రోజు అభిమానులు థియేటర్లకు రావడంతో మంచి కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత మూడో రోజు, నాలుగో రోజు వీకెండ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లు రావడంతో హౌస్ పుల్ కలక్షన్లను ఈ మూవీ రాబట్టింది. ఈ నాలుగు రోజులు భారీగా కలెక్షన్లు రావడంతో టాలీవుడ్లో అత్యంత వేగంగా 50కోట్లు సాధించిన ఐదో చిత్రంగా ‘అఖండ’ రికార్డు నెలకొల్పింది.

    బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో గతంలో ‘లెజెండ్’, ‘సింహ’ వంటి మూవీలు వచ్చాయి. ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నారు. దీంతో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసింది. మొత్తంగా రూ.53కోట్ల మేర బిజినెస్ చేసింది. తొలి రోజున ‘అఖండ’ 15.39కోట్ల షేర్ ను రాబట్టింది.

    రెండో రోజు రూ.6.83కోట్లు, మూడో రోజు 7.03కోట్లు, నాలుగో రోజు 8.31కోట్లు షేర్ ను రాబట్టింది. వీకెండ్ ముగిసిన తర్వాత అంటే ఐదోరోజు కూడా కలెక్షన్లలో పర్వాలేదనిపించింది. ఐదోరోజు కలెక్షన్లు చూస్తే నైజాంలో 1.31 కోట్లు, సీడెడ్‌లో 91లక్షలు, ఉత్తరాంధ్రలో 38లక్షలు, ఈస్ట్ గోదావరిలో 57లక్షలు, వెస్ట్ గోదావరిలో 18లక్షలు, గుంటూరులో 24 లక్షలు, కృష్ణాలో 23లక్షలు, నెల్లూరులో 12లక్షలను రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 3.58 కోట్లు షేర్ దక్కిగా 5.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Also Read: బాలయ్యకు ఎందుకు అంత క్రేజ్ అంటే.. ?

    ఐదురోజులకు కలిపి మొత్తంగా నైజాంలో 13.42 కోట్లు, సీడెడ్‌లో 10.72, ఉత్తరాంధ్రలో 4.12, ఈస్ట్ గోదావరిలో 2.82, వెస్ట్ గోదావరిలో 2.22 , గుంటూరులో 3.50, కృష్ణాలో 2.51, నెల్లూరులో 1.83కోట్ల చొప్పున వసూళ్లను సాధించింది. రెండు రాష్ట్రాల్లో కలిసి 41.14 కోట్లు షేర్ రాగా రూ. 64.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే రూ. 49.04 కోట్లు వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్స్ 80.30కోట్ల మేర వచ్చాయి. మరో 4.96కోట్లు సాధిస్తే ‘అఖండ’ మూవీ హిట్ స్టేటస్ అందుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ ఫీట్ ను మరో ఒకటి రెండ్రోజుల్లో అందుకోవడం ఖాయంగా కన్పిస్తుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    Also Read: అఖండ ఉత్సాహంతో బోయపాటితో చిరు కాంబోకు ప్లాన్​?