https://oktelugu.com/

Priyanka Jawalkar: రెచ్చిపోతాను మహాప్రభో… ఎలా కావాలి అంటే అలా చేస్తాను !

Priyanka Jawalkar: ‘ప్రియాంక జవాల్కర్‌’ అచ్చ తెలుగు హీరోయిన్. ఐతే, ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం రావడం లేదు. దాంతో ఇక ఏదైతే అది అయిందని అందాల ఆరబోతకు సిద్ధం అంటుంది. అంతేకాదండోయ్… ఘాటు ముద్దులు, బోల్డు సీన్లతో విచ్చలవిడిగా రెచ్చిపోతాను అంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు ఎంతో ఓపికతో ఎదురు చూసాను. కానీ నాకు సరైన బ్రేక్ రాలేదు’ అని కాస్త బాధ పడుతూ కాసేపు మౌనం వహించింది. మళ్ళీ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 7, 2021 / 12:10 PM IST
    Follow us on

    Priyanka Jawalkar: ‘ప్రియాంక జవాల్కర్‌’ అచ్చ తెలుగు హీరోయిన్. ఐతే, ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం రావడం లేదు. దాంతో ఇక ఏదైతే అది అయిందని అందాల ఆరబోతకు సిద్ధం అంటుంది. అంతేకాదండోయ్… ఘాటు ముద్దులు, బోల్డు సీన్లతో విచ్చలవిడిగా రెచ్చిపోతాను అంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు ఎంతో ఓపికతో ఎదురు చూసాను. కానీ నాకు సరైన బ్రేక్ రాలేదు’ అని కాస్త బాధ పడుతూ కాసేపు మౌనం వహించింది.

    Priyanka Jawalkar

    మళ్ళీ తేరుకుని.. ‘అందుకే, నా సినిమాల సెలెక్షన్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేయాలని నిర్ణయించుకున్నాను. ఘాటు పాత్రలే కాదు, మసాలా సీన్స్ లో కూడా ఎలా కావాలి అంటే అలా చేస్తాను. ఇన్నాళ్లు బోల్డ్ క్యారెక్టర్లకు మాత్రమే పరిమితం అయ్యాను. ఇక బోల్డ్ కాదు, అంతకు మించి ఉంటుంది, నేనే కాదు, సరైన బ్రేక్ రాని ప్రతి హీరోయిన్.. ఇలాగే నటించాలి అని మడి కట్టుకుని కూర్చోకూడదు’ అని చెప్పుకొచ్చింది.

    మొత్తానికి అవకాశాలు రాకపోయేసరికి ప్రియాంకలో కసి పెరిగింది. అసలు తగ్గేదే లేదు అంటుంది. కాకపోతే అమ్మడులో హీరోయిన్ రేంజ్ గ్లామర్ లేదు అని, అన్నిటికీ మించి బరువు కూడా బాగా పెరిగిపోయిందని ఈ మధ్య తరుచూ ఆమె పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే, ఇక టాలీవుడ్‌ లో ఈ బ్యూటీ హీరోయిన్‌ గా రాణించడం కష్టం అంటున్నారు.

    Also Read: ప్రేమ పేరుతో మోసపోయిన ప్రముఖ బిగ్​బాస్​ నటి

    అయితే, ప్రియాంక నటించిన ‘గమనం’ సినిమా ఈ వీకెండ్ విడుదల కానుంది. ఇంతకుముందు, ‘టాక్సీవాలా’, ‘తిమ్మరుసు’, ‘ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం’ వంటి ఏవరేజ్ హిట్ సినిమాలు చేసింది. అయినా ఎందుకో ఈ బ్యూటీకి చెప్పుకోతగ్గ సినిమాలు రావడం లేదు. పాపం, నిజానికి ప్రియాంక ఈ మధ్య బాగానే సన్నబడింది.

    ఇన్ స్టాగ్రామ్ లో స్లిమ్ గా కనిపిస్తున్న ఫోటోలను కూడా తరుచూ పోస్ట్ చేస్తోంది. కానీ, బయట ప్రియాంక లుక్ కి, వెండితెర పై ప్రియాంక లుక్ కి చాలా తేడా ఉందట. అందుకే, ఈ తెలుగు అమ్మాయికి అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. మరి ఇక నుంచి రెచ్చిపోతాను మహాప్రభో అంటుంది కాబట్టి.. ఛాన్స్ వస్తాయేమో చూడాలి.

    Also Read: అఖండ ఉత్సాహంతో బోయపాటితో చిరు కాంబోకు ప్లాన్​?

    Tags