Rajamouli-Mahesh Babu: ‘ఆర్ఆర్ఆర్’ హడావుడి మరో రెండు వారాల్లో ముగిసిపోతుంది కాబట్టి.. మహేష్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కారణం.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ లుక్ పూర్తి రఫ్ లుక్ లో ఉంటుందట. అలాగే మహేష్ మీసాలతో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

రాజమౌళి హీరో అంటేనే.. మాస్ కి పరాకాష్ట. అందుకు తగ్గట్టుగానే హీరో లుక్ ను రాజమౌళి డిజైన్ చేస్తాడు. ఈ క్రమంలోనే మహేష్ లుక్ కోసం జక్కన్న ప్రత్యేక కసరత్తులు చేశాడట. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా మహేష్ ఈ సినిమాలో కనిపిస్తాడట. మొత్తానికి ఈ వార్త సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది. ఎందుకంటే.. మహేష్ లుక్ మారితే.. ముఖ్యంగా మీసాలతో మహేష్ కనిపిస్తే చూడాలని ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ఇన్నాళ్లకు రాజమౌళి పుణ్యమా అని మహేష్ ఫ్యాన్స్ కోరిక తీరేలా ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రాజమౌళి ఆలియా భట్ తో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆలియా భట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన ఆలియా.. వెంటనే మరో ఛాన్స్ కొట్టేసింది. మహేశ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు.
Also Read: SS Rajamouli Movies: రాజమౌళి తీసిన 12 సినిమాలు ఏవి ? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ?
అన్నట్టు ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ ను అడుగుతున్నారు. మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర కాబట్టి.. గోపీచంద్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాశారని.. ఆ ఫారెస్ట్ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుందని గతంలో వార్తలు వినిపించాయి. ఫారెస్ట్ లో ఉన్న నిధుల అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారట.
ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి క్రమంలో ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఫారెస్ట్ లో జరిగే యాక్షన్ ఎడ్వెంచరెస్ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి మహా దిట్ట. పైగా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం కూడా. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు.
Also Read: ‘బాహుబలి-2′ చరిత్ర.. ‘ఆర్ఆర్ఆర్’ చారిత్రాత్మకం – ఆర్జీవీ
[…] […]