Talibans Blocked Women: అఫ్గనిస్తాన్ లో రాక్షస పాలన సాగుతోంది. తాలిబన్ల చట్టాలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి. మహిళల పట్ల వారి ప్రవర్తన మరీ క్రూరంగా ఉంటోంది. దీంతో వారు దేశంలో నిస్సహాయులుగా బతకాల్సి వస్తోంది. దేశం విడిచి పోదామంటే మగ వారి తోడు లేకుండా వెళ్లొద్దనే కొత్త నిబంధన విధించడంతో చాలా మంది దేశంలోనే ఉండిపోవాల్సి వస్తోంది. తాలిబన్ల చట్టాల క్రూరత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు. పాకిస్తాన్, దుబాయ్, టర్కీ తదితర దేశాలకు వెళ్లడానికి ముందుకొస్తున్న మహిళలకు మగవారు వెంట ఉండటం లేదనే సాకుతో వారి ప్రయత్నాలకు విఘాతం కల్పిస్తున్నారు. దీంతో ఏం చేయలేక తాలిబన్లపై శాపనార్థాలు పెడుతున్నారు.

పురుషులు తోడు లేకుండా విమాన ప్రయాణాలు చేయకూడదని నిర్ణయం తీసుకోవడంతో మహిళలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలిబన్ ప్రభుత్వ విధానాలతో విమానాలు ఎక్కకుండా చేస్తున్నారు. ఒంటరిగా హెరాత్ వెళ్లే మహిళల కోసం విమానం ఎక్కడానికి అనుమతి ఇచ్చినా అది వారు రాకుండానే వెళ్లిపోయింది. దీంతో వారు దేశంలోనే ఉండిపోవాల్సి వ స్తోంది. తాలిబన్ల రాక్షస నిర్ణయాలు ప్రజలను మరింత కష్టాలకు గురిచేస్తున్నాయనడానికి ఇదే తార్కాణం.
మరోవైపు బాలికల విద్యపై కూడా ఆంక్షలు విధించారు. ఆరోతరగతి చదివే విద్యార్థినులు పాఠశాలకు వెళ్లకూడదనే నిబంధన తెచ్చారు. దీంతో బాలికల విద్యకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీనిపై బాలికలు నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. తాలిబన్ ప్రభుత్వంపై అఫ్గాన్ పౌరహక్కుల ఉద్యమకారిణి మెహబూబా సిరాజ్ జాతీయ టీడీ చానల్ టోటీ టీవీలో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకంపై మండిపడ్డారు. బాలికల విద్యకు సహకరించాలని కోరుతున్నారు.

దీంతో అఫ్గాన్ ప్రభుత్వంపై అందరికి ఆగ్రహం పెరుగుతోంది. మహిళలకు కఠినమైన చట్టాలు చేస్తూ వారిని ఆందోళనలకు గురి చేస్తున్నారు. తాలిబన్ల నిర్ణయంతో బాలికలే కాకుండా మహిళలు తీవ్ర నష్టపోతున్నారు. బాలికలకు విద్య దూరం చేస్తే వారి భవిష్యత్ ఏమవుతుందనే ప్రశ్నలు వస్తున్నా తాలిబన్లు లెక్కచేయడం లేదు. తాలిబన్ల చట్టాలపై అన్ని దేశాల నుంచి విమర్శలు వస్తున్నాలెక్కచేయడం లేదు. వారి వెర్రి వేషాలే వారికి ఆనందం తెస్తున్నాయనడంలో సందేహం లేదు.
అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం చేస్తున్న వింత చట్టాలపై అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అనుకూలంగా ఉండే చట్టాలు చేయకపోయినా వారిని ఎటు వెళ్లకుండా చేసే నిబంధనలు విధిస్తూ రాక్షసానానందాన్ని పొందుతున్నారు. దీంతో దేశంలో ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో తెలియడం లేదు. ప్రపంచ దేశాలు స్పందించి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.