Ram Charan – Shankar: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. నిజానికి జనవరి 2 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ లాంగ్ ఫైట్ షూటింగ్ స్టార్ట్ చేయాలి. అయితే, ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

దాంతో సంక్రాంతి తర్వాత డేట్స్ ఇస్తాను అని శంకర్ కి గత నెలలో క్లారిటీ ఇచ్చాడు. అయితే, ఇప్పుడు సంక్రాంతి తర్వాత కూడా చరణ్ డేట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. జనవరి మూడో వారం వరకు చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లోనే బిజీగా ఉంటాడు. ఇక ఆ తర్వాత నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు ఆచార్య ప్రమోషన్స్ లో బిజీ కాబోతున్నాడు.
ఇప్పటికే, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు తన డేట్స్ ఆచార్య కోసం కేటాయించాడు. ఇలా తాను వరుసగా రెండు నెలల పాటు ప్రమోషన్స్ లో బిజీగా ఉండాల్సి వస్తోందని చరణ్ కూడా ఊహించలేదు. అందుకే, శంకర్ ని ప్రత్యేకంగా కలిసి షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేశాడట. ఇక తప్పక శంకర్ తన సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి సెకండ్ వీక్ కి పోస్ట్ ఫోన్ చేసుకున్నాడని తెలుస్తోంది.
Also Read: సుక్కు- చెర్రీ కాంబోలో మరో సూపర్‌హిట్ సినిమా?
అన్నట్టు శంకర్ ఈ సినిమాతో తన దర్శకత్వ పరిధిని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్న శంకర్, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. వాస్తవానికి మొట్టమొదటి పాన్ ఇండియా డైరెక్టర్ శంకరే. అంత అద్భుతమైన రికార్డు ఉంది ఆయనకు.
ఇక ‘రామ్ చరణ్ తో చేస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. అన్నట్టు ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.
Also Read: ఎన్టీఆర్ – చరణ్ మధ్య ఫైట్.. ఆర్ఆర్ఆర్ పై లేటెస్ట్ అప్ డేట్ !