https://oktelugu.com/

ఆనందయ్య ఊరివాళ్లు.. ఊపిరిపీల్చుకున్నారు

ఇన్నాళ్లు ఆనందయ్య మందుతోనే తమకు కరోనా వైరస్ సోకలేదని నమ్మిన కృష్ణపట్నం ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ మందును కొద్దిరోజులుగా ఆపేయడంతో కరోనా కేసులు ఊళ్లో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కరోనా కేసులు లేని ఆనందయ్య సొంతూరు కృష్ణపట్నంలో ప్రస్తుతం కరోనా రావడం మొదలయ్యాయి. పలువురు గ్రామస్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.  ప్రభుత్వం మందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో  […]

Written By: Srinivas, Updated On : May 31, 2021 3:12 pm
Follow us on

ఇన్నాళ్లు ఆనందయ్య మందుతోనే తమకు కరోనా వైరస్ సోకలేదని నమ్మిన కృష్ణపట్నం ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ మందును కొద్దిరోజులుగా ఆపేయడంతో కరోనా కేసులు ఊళ్లో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

కరోనా కేసులు లేని ఆనందయ్య సొంతూరు కృష్ణపట్నంలో ప్రస్తుతం కరోనా రావడం మొదలయ్యాయి. పలువురు గ్రామస్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.  ప్రభుత్వం మందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో  ఆనందయ్య మందుపై అందరికి ఆసక్తి పెరిగింది.

ఆనందయ్య మందు పంపిణీ లేకపోవడం వల్లే కరోనా బారిన పడుతున్నారని గ్రామస్తలు భావిస్తున్నారు. కరోనా మందు కోసం మొన్నటి వరకు కుప్పలు తెప్పలుగా వివిధ ప్రాంతాల వారు తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అలసత్వం కారణంగానే కృష్ణపట్నంలో కేసులు నమోదవుతాయన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆనందయ్య మందు పంపిణీపై నిర్ణయం తీసుకోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.. కరోనా వైరస్ నిర్మూలనకు ఆనందయ్య మందే శరణ్యం అని ప్రజలు భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం అనుమతివ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.