https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బ్లాక్ టికెట్స్ కొని మరీ చూసిన హీరో సినిమా ఏదో తెలుసా? కృష్ణ మూవీ కాదు!

చెన్నై లో ఉన్నప్పుడు తరచుగా ఆటో లోనే తిరిగే వాడిని అని తెలిపారు. అలాగే ఎప్పుడైనా లైన్ లో నిలుచుని సినిమా టికెట్ కొన్నారా అన్న ప్రశ్నకు .. చిన్నతనంలో దేవి థియేటర్ లో సినిమాలు చూశా అని అన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2024 / 08:30 PM IST

    mahesh-babu-13

    Follow us on

    Mahesh Babu : తమ అభిమాన హీరోల గురించి తెలుసుకోవాలని చాలా మంది ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ ఉంటుంది. సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు ఏదైనా సందర్భంలో పంచుకుంటే వాటిని షేర్ చేస్తూ వైరల్ చేస్తుంటారు. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ టాక్ షోలో ఆయన బ్లాక్ లో టికెట్లు కొని సినిమాలు చూసేవాడిని అని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సంగతేమిటో చూద్దాం…

    మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మహేష్ బాబు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళని రాబట్టింది. కేవలం మహేష్ మేనియా వల్ల సినిమా గట్టెక్కింది. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి తో సినిమా కమిట్ అయ్యారు.

    ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో మహేష్ బాబు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా ఉన్న ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్ పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. మీరు ఎప్పుడైనా ఆటో ఎక్కారా అని ప్రదీప్ అడగ్గా .. చిన్నప్పుడు ఎక్కువగా ఆటోలోనే ట్రావెల్ చేసేవాడిని అని మహేష్ అన్నారు.

    చెన్నై లో ఉన్నప్పుడు తరచుగా ఆటో లోనే తిరిగే వాడిని అని తెలిపారు. అలాగే ఎప్పుడైనా లైన్ లో నిలుచుని సినిమా టికెట్ కొన్నారా అన్న ప్రశ్నకు .. చిన్నతనంలో దేవి థియేటర్ లో సినిమాలు చూశా అని అన్నారు. రంగీలా సినిమా కోసం లైన్లో నిల్చొని టికెట్లు దొరక్కపోవడంతో బ్లాక్ లో కొన్నాను. కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు చూసేందుకు బ్లాక్ లో టిక్కెట్లు కొన్న సందర్భాలు ఉన్నాయని మహేష్ చెప్పుకొచ్చారు. మహేష్ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.