Homeఆంధ్రప్రదేశ్‌Balakrishna's assets : బాలకృష్ణ ఆస్తుల విలువ ఎన్ని కొట్లో తెలుసా? భార్య వసుంధర కంటే...

Balakrishna’s assets : బాలకృష్ణ ఆస్తుల విలువ ఎన్ని కొట్లో తెలుసా? భార్య వసుంధర కంటే తక్కువే! లెక్కలు ఇవే!

Balakrishna’s assets : నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీ. ఆయన హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. గత రెండుసార్లు ఆయన విజయం సాధించారు. నేడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అఫిడవిట్ లో తన ఆస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడించారు. అలాగే అప్పుల లెక్కలు చెప్పారు.

ఇక బాలకృష్ణ సమర్పించిన లెక్కల ప్రకారం ఆయనకు రూ. 81.63 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే ఆయనకు రూ. 9.9 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక భార్య వసుంధర పేరిట ఉన్న ఆస్తుల వివరాలు కూడా ఆయన సమర్పించారు. వసుంధర ఆస్తి విలువ రూ. 140.38 కోట్లు. ఆమెకు రూ. 3.83 కోట్ల అప్పులు ఉన్నాయట. ఇక బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ. 58.63 కోట్లు. మోక్షజ్ఞకు ఎలాంటి అప్పులు లేవు.

మొత్తంగా బాలకృష్ణ కుటుంబానికి రూ. 280.64 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే రూ. 13.73 కోట్ల అప్పులు ఉన్నాయి. బాలకృష్ణ అధికారికంగా ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ లో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అనంతరం బాలకృష్ణ తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీ దర్శకత్వంలో 109వ చిత్రం చేశారు. చాలా వరకు షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. ఎన్నికల ప్రచారం కోసం షార్ట్ బ్రేక్ ఇచ్చారు.

ఇటీవల విడుదలైన ఎన్బీకే 109 గ్లింప్స్ ఆకట్టుకుంది. బాలయ్య డైలాగ్ దుమ్మురేపింది. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం కలదంటున్నారు. కాగా బాలయ్య వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆయన గత చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలు సాధించాయి. నెక్స్ట్ ఆయన అఖండ 2కి సిద్ధం అవుతున్నారు. ఎన్నికల అనంతరం అఖండ 2 పై ప్రకటన ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version