Game Changer Movie : #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి రాబోతున్న ‘గేమ్ చేంజర్’ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీజర్ ని చూసినప్పుడే వింటేజ్ శంకర్ మార్క్ స్టోరీ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే తో రాబోతున్న సినిమా అని అందరికీ అర్థమైపోయింది. ‘ఇండియన్ 2 ‘ భారీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో అభిమానులు ‘గేమ్ చేంజర్’ చిత్రం పై ముందుగా తడబడ్డారు. శంకర్ సార్ పని అయిపోయిందేమో, ‘గేమ్ చేంజర్’ చిత్రం కూడా అలాగే ఫ్లాప్ అవుతుందేమో అని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతూ తమ భయాన్ని వ్యక్తపరిచారు. కానీ టీజర్ విడుదలైన తర్వాత శంకర్ సార్ ట్రాక్ లోకి వచ్చాడు. మినిమం గ్యారంటీ బ్లాక్ బస్టర్ గా గేమ్ చేంజర్ నిలవబోతుంది అని సంబరాలు చేసుకున్నారు.
అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఏ రేంజ్ వసూళ్లను రాబట్టాలి..?, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఎంత బిజినెస్ జరిగింది?, వరల్డ్ వైడ్ గా ఎంత బిజినెస్ జరిగింది?, ఆడియో రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్, సాటిలైట్ రైట్స్ ఎంత? అనేది ఇప్పుడు వివరంగా మనం చూద్దాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి దాదాపుగా 160 కోట్ల రూపాయిల రేషియో లో థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అంటే విడుదల తర్వాత కచ్చితంగా 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి, అప్పుడే సూపర్ హిట్ లెక్కలోకి వస్తుంది ఈ చిత్రం. అదే విధంగా నార్త్ అమెరికా మరియు మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 48 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఓవర్సీస్ నుండి రావాలి, అప్పుడే 48 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకోగలదు ఈ చిత్రం.
అదే విధంగా తమిళనాడు శంకర్ కి ఒక సూపర్ స్టార్ కి ఉన్నంత ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని ఆదిత్య రామ్ అనే ప్రముఖ పారిశ్రామిక వేత్త కొనుగోలు చేసాడు. సుమారుగా 45 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ తమిళ వేశాం కి జరిగిందట. అంటే ఇక్కడ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టాలి, అప్పుడే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు. హిందీ లో కూడా 40 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయట. ఇక కర్ణాటక లో 13 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ చిత్రం, కేరళ లో మూడు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 309 కోట్ల రూపాయలకు జరిగింది. కాబట్టి గేమ్ చేంజర్ చిత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలంటే 310 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి.