
Mahesh Babu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి సంబంధించి ఏ చిన్న వార్త బయటకి వచ్చినా అది సెన్సేషనల్ హాట్ టాపిక్ గా నిలిచిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే..ఆయన మామూలుగా ఏదైనా ప్రాంతం ని కానీ, ఆఫీస్ ని కానీ సందర్శించిన ఆరోజు మొత్తం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోతుంది.రీసెంట్ గా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఆఫీస్ ని నిన్న మహేష్ బాబు సందర్శించాడు.తన ఆధార్ కార్డు కి సంబంధించిన వెరిఫికేషన్ కోసం ఆయన అక్కడకి వచ్చినట్టు తెలుస్తుంది..మామూలు క్యాజువల్ షర్ట్ తో అదిరిపొయ్యే హెయిర్ స్టైల్ లో మహేష్ బాబు లుక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మన ఇండియా లో ప్రస్తుతం ఆధార్ కార్డు కి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో అందరికీ తెలిసిందే..ఏ పని చెయ్యాలన్న ఆధార్ కార్డు ఉండాల్సిందే.అది ఎంత పెద్ద స్టార్ హీరో కి అయినా , పొలిటిషన్ కి అయినా ఆధార్ కార్డు లేనిదే ఏ పని కూడా జరగదు, అయితే అలాంటి అవసరాలు ఉన్న ఆధార్ కార్డు ని మహేష్ బాబు ఇప్పటి వరకు తీసుకోలేదా అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, ఈమధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడం తో ఈ మూవీ పై ఫ్యాన్స్ లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
