
NTR- Koratala Siva Movie: #RRR చిత్రం తో గ్లోబల్ వైడ్ కనీవినీ ఎరుగని రేంజ్ లో పాపులారిటీ మరియు క్రేజ్ దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం పై అభిమానులు ఎంత అసంతృప్తి తో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కొరటాల శివ తో సినిమా చేయబోతున్నాను అని ఎన్టీఆర్ ఎప్పుడో ప్రకటించాడు కానీ ఇప్పటి వరకు కనీసం పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభం కాలేదు..అదే అభిమానుల బాధ.
అయితే ఎట్టకేలకు మొన్న జరిగిన కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఈ నెల లోనే పూజా కార్యక్రమాలు జరిపి వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాము అంటూ అధికారికంగా చెప్పి ఫ్యాన్స్ కి ఊరట ఇచ్చాడు.ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆ వార్త చెప్పాడో అప్పటి నుండి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు బయటకి లీక్ అవుతూ వస్తున్నాయి.రీసెంట్ గా ఈ చిత్రం గురించి బయటకొచ్చిన ఒక వార్త సోషల్ మీడియా ని ఊపేస్తోంది.
అదేమిటంటే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ కోసం గత కొద్దీ రోజుల నుండి సంప్రదింపులు జరుపుతున్నాడట కొరటాల శివ.ఆ చర్చలు నేటికీ సఫిలీకృతం అయ్యాయని, ఈ చిత్రం లో విలన్ రోల్ చెయ్యడానికి విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని ఫిలిం నగర్ లో ఒక టాక్ జోరుగా ప్రచారం సాగుతుంది..విక్రమ్ కి కోలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు,తెలుగులో కూడా ఆయనకీ మంచి మార్కెట్ ఉంది.

ఇక ఆయన యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.నట విశ్వరూపం చూపించేస్తాడు, ఇక నటనలో ఎన్టీఆర్ సంగతి అందరికీ తెలిసిందే.ఎలాంటి పాత్రలో అయినా జీవించడం ఆయన స్పెషాలిటీ, యాక్టింగ్ లో ఎవరెస్టు లాంటి ఈ ఇద్దరు కలిస్తే బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందో ఊహిస్తుంటేనే మన రోమాలు నిక్కపొడుస్తున్నాయి..అభిమానులకు మరియు మూవీ లవర్స్ కి ఈ కాంబినేషన్ ఒక కనుల పండుగే అని చెప్పాలి.