
Mahesh Babu On Dasara Movie: సూపర్ స్టార్ మహేష్ కి ఓ అలవాటు ఉంది. పాపులర్ చిత్రాల రిజల్ట్ పై ఆయన స్పందిస్తారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రత్యర్థులుగా భావించే హీరోల సినిమాలకు కూడా ఆయన రివ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్నాళ్లుగా ఆయన సైలెంట్ అయ్యారు. వన్ వర్డ్ రివ్యూలు ఇవ్వడం మానేశారు. చాలా గ్యాప్ తర్వాత దసరా మూవీని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. ‘దసరా మూవీ గర్వించదగ్గ చిత్రం. అదిరిపోయింది’ అంటూ ఫైర్ ఎమోజీలు జోడించాడు. దసరా మూవీ బాగుందని, తెలుగు సినిమా గర్వించదగ్గ చిత్రమని మహేష్ షార్ట్ అండ్ స్వీట్ గా తెలియజేశాడు.
దసరా మూవీకి మద్దతుగా మహేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక మహేష్ కామెంట్స్ కి హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ‘ఒక మంచి సినిమా గురించి మీరు చెప్పిన మాటలు.. పోకిరి సినిమాకు మణిశర్మ బీజీఎమ్ లా ఉన్నాయి’ అంటూ నాని వినూత్న కామెంట్ చేశారు. మహేష్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్ గా ఉన్న పోకిరి మూవీ బీజీఎమ్ తో మహేష్ ప్రశంసలను నాని పోల్చాడు. నాని ట్వీట్ సైతం వైరల్ అవుతుంది.
నాని దసరా ఓపెనింగ్ డే వసూళ్లు దుమ్మురేపింది. ఈ ఏడాదికి ఆల్ టైం బెస్ట్ నమోదు చేయడం విశేషం. సంక్రాంతి హిట్స్ గా ఉన్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల ఫస్ట్ డే నైజాం ఓపెనింగ్స్ ని దసరా అధిగమించింది. ఇక టైర్ టూ హీరోలలో నాని హైయెస్ట్ ఓపెనింగ్ డే రికార్డు సొంతం చేసుకున్నారు. భారీ కమర్షియల్ హిట్ కొట్టి నాని చాలా కాలం అవుతుంది. నాని గత చిత్రం అంటే సుందరానికీ డిజాస్టర్ అయ్యింది.

దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. తెలుగులో ముఖ్యంగా నైజాంలో దసరా చిత్ర వసూళ్లు బాగున్నాయి. బ్రేక్ ఈవెన్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక సినిమా ఈ స్థాయి విజయం సాధిస్తుందో మొదటి వారం ముగిస్తే కానీ తెలియదు. మొత్తంగా నాని హిట్ కొట్టాడు.
So so proud of #Dasara!! Stunning cinema! 🔥🔥@NameisNani @KeerthyOfficial @Dheekshiths @thondankani @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP
— Mahesh Babu (@urstrulyMahesh) March 31, 2023