
Anil Ravipudi: కామెడీ సినిమాలతో అలరించే అనిల్ రావిపూడి ఇప్పుడు ఫేమస్ డైరెక్టర్. కామెడీ కోరుకునే వారు అనిల్ రావిపూడి సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. ‘పటాస్’ సినిమాతో డైరెక్టర్ గా పయనం మొదలు పెట్టిన ఆయన మొన్నటి F3 వరకు అన్ని దాదాపు సక్సెస్ అయినవే ఉన్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలకృష్ణతో #NBK108 సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. అయితే అనిల్ రావిపూడి మొదటిసారి మాస్ మూవీ తీస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే కామెడీ హీరో ఎవరంటే అల్లరి నరేష్ పేరే చెబుతారు. అయితే వీరిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది?
పాప్ సింగర్ స్మిత వీరిద్దరి ఓ ఇంటర్వ్యూ చేశారు. సోనీ లైవ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, అల్లరి నరేష్ లు పక్కపక్కనే కూర్చున్నారు. సాధారణంగా ఏ ఇంటర్వ్యూలోనైనా తమ జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెబుతారు. కానీ వీరు తమ జీవితంలో జరిగిన కామెడీ గురించి చెప్పడం విశేషం. అయితే అంతకుముందే యాంకర్ స్మిత వీరిని ఎలాంటి కామెడీ అంటే ఇష్టమని, మీ లైఫ్ లో ఎప్పుడైనా ఫన్ ఉందా? అని కొశ్చన్ చేశారు. ఈ ప్రశ్నకు ముందుగా అనిల్ రావిపూడి సమాధానం ఇచ్చారు.

ప్రతీ కుటుంబంలో ఫన్ ఉంటుంది. దానిని బట్టే సినిమా తీయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒకటి చెబుతాను ఓ చపాతి కర్ర విసిరేస్తారు.. ఆ తరువాత కత్తులు, కటార్లు కూడా వేస్తారు.. అదేంటని మనం చేయేత్తితే.. ‘ఏంటీ.. నన్ను చంపేస్తావా?’ అని భయపడుతారు. ఇలాంటి సీన్ నా లైఫ్ లో జరిగింది. దీనిని ఎఫ్ 2 సినిమాలో చూపించాం అని అనిల్ రావిపూడి అన్నారు. మా జీవితంలో ఫన్ ఎక్కువగా ఉంది. అందుకే నాకు కామెడీ చిత్రాలు తీయాలని అనుకున్నాను ఇక ఎఫ్ 2 సినిమాలో పెళ్లి చూపులు సీన్ నాకు బాగా ఇష్టమని అన్నారు.
ఇదే వేదికపై అల్లరి నరేష్ మాట్లాడుతూ నాకు తికమక పెట్టే కామెడీ అంటే చాలా ఇష్టం. ఈ రకమైన ‘మైకెల్ మదన కామరాజు’ సినిమాను నేను చాలా సార్లు చూశాను అని అన్నారు. ఇక నా జీవింలో జరిగిన అత్యంత కామెడీ ఏంటంటే.. ఒక అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. నేను ఆ అమ్మాయి మనకు వర్కౌట్ అవుతుందని అనుకుంటాను. కానీ ఒకరోజు ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి ‘మీ అన్నయ్య నెంబర్ ఇస్తావా’ అని అడుగుతుంది.. అని నరేష్ అనగానే అక్కడున్నవాళ్లంతా ఘోల్లుమని నవ్వుతారు.
‘నిజం విత్ స్మిత’ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇది. ఈ వీడియో వైరల్ అవుతోంది. పాప్ సింగర్ గా ఫేమస్ అయిన స్మిత ఈ ప్రొగ్రామ్ లో యాంకర్ గా తన ప్రశ్నలతో ఆకట్టుకుంటున్నారు. అయితే కామెడీ డైరెక్టర్ తో పాటు కామెడీ హీరో ఒకచోట కలిస్తే ఎలాంటి కామెడీ పండుతుందునే ఉద్దేశంతో ఈ వీడియోను తీశారు. ఈ వీడియో ఫుల్ ఎపిసోడ్ సోనీ లైవ్ అనే ఓటీటీలో ప్రసారం అవుతోంది.