సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డేకు మహేష్ గిప్ట్..

సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ప్రతీయేటా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఫస్టు లుక్, టీజర్, సాంగ్స్, సినిమా రిలీజ్ ఇలా ఏదో ఒక సర్ ప్రైజ్ చేస్తుంటాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఈసారి కృష్ణ బర్త్ డేకు మహేష్ బాబు నుంచి […]

Written By: Neelambaram, Updated On : May 31, 2020 12:13 pm
Follow us on


సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ప్రతీయేటా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఫస్టు లుక్, టీజర్, సాంగ్స్, సినిమా రిలీజ్ ఇలా ఏదో ఒక సర్ ప్రైజ్ చేస్తుంటాడు. అయితే లాక్డౌన్ కారణంగా ఈసారి కృష్ణ బర్త్ డేకు మహేష్ బాబు నుంచి అప్డేట్ ఉంటుందా? లేదా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ నేడు మహేష్ బాబు తన కొత్త మూవీ అప్డేట్స్ ఇచ్చి సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేశాడు.

‘గీత గోవిందం ఫేం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 27వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్, టైటిల్ ను మహేష్ తన ట్వీటర్లో విడుదల చేశాడు. ఈ మూవీకి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ ఫస్టు లుక్‌లో మహేష్ బాబు ఒక చెవికి రింగు, మెడపైన రూపాయి బిళ్ల టాటూతో అదరగొట్టాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో SSMB27, సర్కారు వారి పాట (SarkaruVaari Paata) హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

 

https://twitter.com/urstrulyMahesh/status/1266937240808157185