ఎంటర్టైన్మెంట్Mahesh Babu : మహేష్ బాబు పొడుగు జుట్టును పీకేసిన అక్క మంజుల... ఆయన రియాక్షన్...

Mahesh Babu : మహేష్ బాబు పొడుగు జుట్టును పీకేసిన అక్క మంజుల… ఆయన రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Mahesh Babu : మహేష్ బాబు తన లుక్ చేంజ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన లాంగ్ హెయిర్ లో కనిపిస్తున్నారు. రాజమౌళి సినిమా కోసమే ఈ మేకోవర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు పోకిరి, అతిథి చిత్రాల్లో లాంగ్ హెయిర్ తో కనిపించారు. అయితే ఆయన గడ్డంతో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. టక్కరి దొంగ సినిమాలో కౌ బాయ్ రోల్ చేయగా లైట్ గా గడ్డంతో ఆయన లుక్ ఉంటుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి మహేష్ ని మార్చేస్తాడనే వాదన వినిపిస్తోంది. ఆయన్ని సిక్స్ ప్యాక్ లో చూపించినా ఆశ్చర్యం లేదు.

కాగా మహేష్ లాంగ్ హెయిర్ పై అక్క మంజుల రియాక్షన్ వైరల్ గా మారింది. ఏప్రిల్ 28 ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఓ పెళ్లి వేడుక జరిగింది. మహేష్ కి బంధువులు అవుతారని సమాచారం. దీంతో మహేష్ కుటుంబ సభ్యులు అందరూ ఈ పెళ్ళికి హాజరయ్యారు. మహేష్ సిస్టర్స్ మంజుల, ప్రియదర్శిని సైతం వేడుకలో సందడి చేశాడు. కాగా మహేష్ లాంగ్ హెయిర్ చూసిన మంజుల పట్టుకుని లాగింది. ఆమె మహేష్ ని చూస్తూ గట్టిగా నవ్వేసింది.

ఈ క్రమంలో మహేష్-మంజుల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంజుల నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించారు. దర్శకుడు నీలకంఠం తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘షో’ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో కేవలం రెండు పాత్రలే ఉంటాయి. మంజులతో పాటు నటుడు సూర్య కుమార్ నటించారు.

ఇక మహేష్ బాబు-రాజమౌళి మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. స్క్రిప్ట్ లాక్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వీలైనంత త్వరగా ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ మొదలు కానుంది. దాదాపు రూ. 800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని సమాచారం. జంగిల్ అడ్వెంచర్ డ్రామా ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. మహేష్ పాత్ర ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా ఉంటుందట. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తారని సమాచారం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper