https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఈ ఎలిమెంట్స్ పక్కగా ఉండాల్సిందే.. లేకపోతే సినిమా ఆడదు…

మహేష్ బాబు మంచి కథలను ఎంచుకొని తమ ఫ్యాన్స్ కి మంచి సినిమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే మొదట్లో మహేష్ బాబు చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

Written By:
  • Gopi
  • , Updated On : February 29, 2024 / 05:42 PM IST
    Follow us on

    Mahesh Babu: ప్రేక్షకులు ఎన్నో బాధల నుంచి రిలాక్స్ అవ్వడానికి సినిమాలని చూస్తూ ఉంటారు. దాని ద్వారా కనీసం 2 గంటలైనా వాళ్ళ బాధల్ని వాళ్లు మర్చిపోతూ ఉంటారు.అందుకే జనాలు సినిమాలని చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక దీని ద్వారా వర్క్ టెన్షన్ తగ్గడమే కాకుండా మైండ్ కూడా కాస్త రిలాక్స్ అవుతుంది. ఇక ఈ క్రమంలోనే మంచి సినిమాలు తీసిన హీరోలకు ప్రేక్షకుల నుంచి స్టార్ ఇమేజ్ లభిస్తుంది. ప్లాప్ సినిమాలు తీసిన హీరోలకి మాత్రం జనాల నుంచి పెద్దగా ఆదరణ అయితే దక్కదు. అందువల్ల ప్రతి హీరో సూపర్ హిట్ సినిమాలు తీయడానికే మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు.

    ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు మంచి కథలను ఎంచుకొని తమ ఫ్యాన్స్ కి మంచి సినిమాలు అందించడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే మొదట్లో మహేష్ బాబు(Mahesh Babu) చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పోకిరి సినిమా వచ్చినప్పటి నుంచి ఆయన వరుసగా మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఖలేజా సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన దూకుడు సినిమా నుంచి మొన్న వచ్చిన గుంటూరు కారం సినిమా వరకు కూడా, సినిమా కాన్సెప్ట్ ఎలా ఉన్నా ఆ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం మహేష్ బాబుకు నచ్చినట్టుగా ఉండేలా చూసుకుంటాడట.

    అవి ఏంటి అంటే సినిమా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని కామెడీ సీన్స్ ఉండేలా చూసుకుంటాడట. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ ఉండాలని అవి కూడా బలంగా ఉండాలని దర్శకులతో ముందే చెప్పి ఆ సీన్లని స్పెషల్ గా రాయిస్తాడట…

    ఇక మహేష్ బాబు సినిమాల్లో ఏది ఉన్నా లేకపోయిన దూకుడు సినిమా నుంచి కామెడీ అలాగే ఎమోషన్ సీన్స్ అయితే పక్కగా మిస్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటునే సినిమాలను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక అదే తన సినిమాల సక్సెస్ సీక్రెట్ అని కూడా మహేష్ బాబు చెప్తూ ఉంటాడు…మరి రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొద్ది సంవత్సరాల పాటు మనం వెయిట్ చేయక తప్పదు…