Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో పట్టుబడిన లిషి గణేష్ పరారీలో ఉంది. అయితే ఆమె మిస్ అయినట్లు సిస్టర్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. గజ్జెల వివేకానంద్ అనే ప్రముఖుడు రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశాడు. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ అలీ ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేశాడు. పోలీసుల దాడిలో కొందరు అరెస్ట్ అయ్యారు. దర్శకుడు క్రిష్, గజ్జెల వివేకానంద్, నటి లిషి గణేష్, శ్వేత, సందీప్, రఘు చరణ్, కేదార్, నీల్, నిర్భయ్ ఈ పార్టీలో పాల్గొన్నారు.
వివేకానంద్, నీల్, నిర్భయ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. యూట్యూబ్ నటి లిషి చెల్లి కుషిత(Kushitha Kallapu) ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న లిషి పరార్ అయ్యింది. ఆమె కనిపించడం లేదని కుషిత కేసు పెట్టింది.
డ్రగ్ పార్టీ అనంతరం లిషి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఆమె కుటుంబ సభ్యులకు అందుబాటులో లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. లిషి, కుషిత గతంలో ఒకసారి డ్రగ్ కేసులో ఇరుక్కున్నారు. అరెస్ట్ కావడం జరిగింది. తాజా కేసులో లిషి మాత్రమే ఉన్నారు. కాగా దర్శకుడు క్రిష్ సైతం పరారీలో ఉన్నారు. ఎఫ్ ఐ ఆర్ లో క్రిష్ ని 10వ నిందితుడిగా చేర్చారు. అతనికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
పలుమార్లు క్రిష్ సైతం ఈ డ్రగ్ పార్టీలలో పాల్గొన్నట్లు సమాచారం. క్రిష్ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించనున్నారు. మూత్ర, రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయడం ద్వారా క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా? అని తేల్చనున్నారు. మొత్తంగా హైదరాబాద్ డ్రగ్ అడ్డగా మారింది. ప్రతిసారి డ్రగ్ కేసుల్లో టాలీవుడ్ ప్ ప్రముఖులు బుక్ అవుతున్నారు. పూరి జగన్నాథ్, రవితేజ, ఛార్మి, ముమైత్ ఖాన్, రకుల్, రానా, తరుణ్, సుబ్బరాజ్, తనీష్ వంటి చిత్ర ప్రముఖులు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే…