Mahesh Babu Daughter Sitara: కూతురు సితార చేసిన పనికి మహేష్ షాక్… పదేళ్ల ప్రాయంలోనే అమెరికన్ స్ట్రీట్స్ లో!

కానీ పసిప్రాయంలో అరుదైన గౌరవాన్ని సితార అందుకుంది. దీంతో మహేష్ బాబు స్పందించారు. 'న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో మెరిసిన సితార. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది క్రాకర్. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలి' అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. మహేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే టీనేజ్ కూడా రాకుండానే సితార సంపాదన మొదలుపెట్టింది.

Written By: Shiva, Updated On : July 4, 2023 4:51 pm

Mahesh Babu Daughter Sitara

Follow us on

Mahesh Babu Daughter Sitara: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ఓ సామెత ఉంది. పిల్లలుగా ఉన్నప్పుడే కొందరి టాలెంట్స్ బయటపడతాయి. మహేష్ బాబు చిన్నతనంలోనే సిల్వర్ స్క్రీన్ ని దున్నేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్డమ్ తెచ్చుకున్న ఏకైన చిచ్చర పిడుగు. పసిప్రాయంలోనే మల్టీస్టారర్స్, డ్యూయల్ రోల్ చిత్రాలు చేశాడు. ఫైట్స్, సాంగ్స్ లో అలరించారు. చిన్నప్పటి మహేష్ ని తలపిస్తుంది కూతురు సితార. పట్టుమని పదేళ్ల ప్రాయంలోనే సంచలనాలు చేస్తుంది. తాజాగా సితార సాధించిన విజయానికి తండ్రి మహేష్ బాబు మురిసిపోతున్నారు.

ఓ అంతర్జాతీయ జ్యూవెలరీ బ్రాండ్ కి సితార ప్రచార కర్తగా ఉంది. ఆ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తుంది. పీఎంజే అనే ఈ బ్రాండ్ యాడ్ షూట్లో సితార పాల్గొంది. పీఎంజే సంస్థ సితార హోర్డింగ్స్ న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించారు. ఎంతో చరిత్ర కలిగిన న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్లో సితార హోర్డింగ్స్ కనిపించడం అరుదైన విషయం. గొప్ప గొప్ప సూపర్ స్టార్స్ కి కూడా ఆ అదృష్టం దక్కలేదు.

కానీ పసిప్రాయంలో అరుదైన గౌరవాన్ని సితార అందుకుంది. దీంతో మహేష్ బాబు స్పందించారు. ‘న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో మెరిసిన సితార. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది క్రాకర్. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలి’ అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. మహేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే టీనేజ్ కూడా రాకుండానే సితార సంపాదన మొదలుపెట్టింది.

సితార స్పీడ్ చూస్తుంటే త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనిపిస్తుంది. గత ఏడాది విడుదలైన సర్కారు వారి పాట మూవీలోని ‘పెన్నీ పెన్నీ’ సాంగ్ ప్రోమోలో సితార నటించింది. సితార డాన్స్ లో శిక్షణ తీసుకుంటుంది. యానీ మాస్టర్ సితారకు శిక్షణ ఇస్తుంది. సితారకు బాలీవుడ్ స్టార్స్ తో కూడా పరిచయాలు ఉన్నాయి. హీరోయిన్ అలియా భట్ సితార బెస్ట్ ఫ్రెండ్. సీతారకు ఆ మధ్య బట్టలు పంపింది అలియా.