https://oktelugu.com/

Gajala: పూర్తిగా మారిపోయిన గజాలా.. ఇప్పుడెలా ఉందో చూడండి..

రాజీ అలియాస్ గజాలా తండ్రి వ్యాపారవేత్త. వీరు మస్కట్లో ఉండడంతో అక్కడే ఈమె జన్మించింది. ఆ తరువాత వీరు ముంబైకి షిప్ట్ అయ్యారు. అక్కడ ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అమ్మడు మోడల్ రంగంలోకి అడుగుపెట్టారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 4, 2023 / 04:45 PM IST

    Gajala

    Follow us on

    Gajala: ఒకటి, రెండు సినిమాల్లో నటించినా కొందరు భామలు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటారు. వారి నటనా ప్రతిభను ప్రదర్శించి ఎప్పటికీ నిలిచిపోయే పాత్రలు చేస్తుంటారు. ఆయితే ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు లేక.. ఇక పర్సనల్ విషయాల్లో ఫెయిల్ కావడంతో ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటేస్ట్ పిక్ పెట్టి అలరిస్తున్నారు. అలాంటి వాళ్లలో గజాల ఒకరు. అసలు రాజీ అయిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే ఫేమస్ అయింది. ఆ తరువాత రెండో మూవీతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన తరువాత సినిమాల వైపు చూడడం మానేసింది. కానీ ప్రస్తుతం గజాలాను చూసి నోరెళ్ల బెట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ ఎలా ఉందంటే?

    రాజీ అలియాస్ గజాలా తండ్రి వ్యాపారవేత్త. వీరు మస్కట్లో ఉండడంతో అక్కడే ఈమె జన్మించింది. ఆ తరువాత వీరు ముంబైకి షిప్ట్ అయ్యారు. అక్కడ ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అమ్మడు మోడల్ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే సినిమాల్లోకి రావాలన్న తపన ఉండడంతో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంతలో తెలుగు నుంచి ఆమెకు పిలుపువచ్చింది. 2001లో జగపతి బాబు హీరోగా నటించిన ‘నాలో ఉన్న ప్రేమ’ లో నటించింది. ఫస్ట్ మూవీలో చలాకీ పిల్లలాగా నటించిన గజాలా ఫేమస్ అయింది. అయితే ఇందులో లయతో పాటు రెండో హీరోయిన్ గా నటించింది.

    ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో గజాలా ఫేమస్ అయింది. ఇక ఆక్కడి నుంచి ఈ భామకు తిరుగులేకుండా పోయింది. తరుణ్ తో కలిసి అదృష్టం, ఉదయ్ కిరణ్ తో కలిసి కలుసుకోవాలని సినిమాలు చేసింది. చివరికి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కలిసి మల్లీశ్వరిలో నటించడంతో గజాలా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అక్కడితో ఈ భామ సినిమాలకు పులిస్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది.

    అయితే జీవితంలో జరిగిన ఓ సంఘటన తనను కలిచి వేసింది. 2002జూలై 22న హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ప్రశాంత్ కుటీర్ అనే గెస్ట్ హౌస్ లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. అయితే ఆమెతో ఉన్న సహా నటులు అర్జున్ సరైన సమయంలో గుర్తించి నిమ్స్ కు తరలించడంతో ప్రాణపాయం తగ్గింది. అయితే ఆ తరువాత హిందీ టీవీ నటుడు ఫైజల్ రజాఖాన్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం గజాలా లేటేస్ట్ ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.

    Tags