Sitara: మహేష్ బాబు కూతురు చూపించిన ఈ ప్రేమకు ఎవ్వరైన ఫిదా కావాల్సిందే.. వైరల్ వీడియో

మహేష్ బాబు -నమ్రత ల గారాల పట్టి సితార హీరో కూతురు గానే కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంటోంది. ఈమె ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ చానెల్ పెట్టి... దాని ద్వారా చిన్న పిల్లలను అలరిస్తోంది.

Written By: Chai Muchhata, Updated On : October 1, 2023 12:06 pm

Sitara

Follow us on

Sitara: ఘట్టమనేని వారసురాలు, సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సినిమాల్లోకి రాకముందే సెలబ్రెటీగా మారారు. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన అభిమానులు సంపాదించుకున్న సితార అప్పుడప్పుడు పలు సేవా కార్యాక్రమాల్లో పాల్గొంటూ అలరిస్తోంది. చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకుంటూ అందరి మన్ననలను పొందుతోంది. గతంతో ఓ యాడ్ లో నటించగా తనకు వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఓ చారిటీ ట్రస్టుకు అందించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన ఉదాతరను చాటుకున్నారు. ఇంతకీ సితార ఏం చేసిందంటే?

మహేష్ బాబు -నమ్రత ల గారాల పట్టి సితార హీరో కూతురు గానే కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంటోంది. ఈమె ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ చానెల్ పెట్టి… దాని ద్వారా చిన్న పిల్లలను అలరిస్తోంది. అంతేకాకుండా కవరింగ్ సాంగ్స్ కు డ్యాన్స్ లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ కు వీపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. దీంతో సితారకు ఆ మధ్య జ్యూవెల్లరీ కంపెనీ నుంచి యాడ్ లో నటించమని ఆఫర్ వచ్చింది. ఈ యాడ్ లో నటించినందుకు ఆమె భారీగానే పారితోషికం అందుకుంది. అయితే తనకు వచ్చిన రెమ్యూనరేషన్ మాత్రం విరాళంగా ఇచ్చేసింది.

తాజాగా హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గోనేందుకు సితార తల్లి నమ్రతతో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా అక్కడున్న చిన్నారులతో సితార ఫొటోలు దిగి అలరించింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వృద్దులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. అంతేకాకుండా వారిని ఎంతో ప్రేమగా చేయిపట్టి స్టేజిపైకి తీసుకొచ్చింది. ఇలా ఆమె వృద్ధులతో ఆప్యాయంగా ఉండడం చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

చిన్నవయసులోనే ఎంతో పెద్ద మనసు ఉన్న సితారను పలువురు కొనియాడారు. ఇప్పటికే దాన కర్ణురాలు అని పేరు తెచ్చుకున్న సితారా తాజాగా ఆమె ఇతరులతో ఎంతో ప్రేమగా ఉంటారని నిరూపించుకుంది. మంచి మనసు ఉన్న సితారకు భవిష్యత్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు కొందరు సోషల్ మీడియాలోకామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.