Mahesh Babu On Prakash Raj: ప్రకాష్ రాజ్ లేకుండా మహేష్ బాబుకు హిట్ రాదా? ఇవే సాక్ష్యాలు!

మొట్టమొదట రాజ కుమారుడు అనే సినిమాతో మహేష్ బాబు టాలీవుడ్ హీరోగా పరిచయమయ్యారు. ఇందులో ప్రకాష్ రాజ్ కూడా ఓ మంచి పాత్రలో నటించి మెప్పించాడు.

Written By: Suresh, Updated On : January 10, 2024 6:06 pm

Mahesh Babu On Prakash Raj

Follow us on

Mahesh Babu On Prakash Raj: మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబోలో వచ్చే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు నటించే సినిమా కచ్చితంగా హిట్ ను అందుకుంటుంది. ప్రకాష్ రాజ్ మహేష్ బాబు కలిసి వస్తాడనే టాక్ కూడా ఉంది. ఒకటి రెండు సార్లు పొరపాటు జరిగినా మిగిలిన సినిమాలు మాత్రం కచ్చితంగా హిట్ అవుతాయి. అందుకే మహేష్ సినిమా వస్తుందంటూ ప్రకాష్ రాజ్ ఉన్నారా లేదా అనే ఆరా తీస్తుంటారు నెటిజన్లు. మరి ఇప్పుడు రాబోయే సినిమా ప్రకాష్ రాజ్ పాత్ర ఉన్నాడా? లేదా అనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

మొట్టమొదట రాజ కుమారుడు అనే సినిమాతో మహేష్ బాబు టాలీవుడ్ హీరోగా పరిచయమయ్యారు. ఇందులో ప్రకాష్ రాజ్ కూడా ఓ మంచి పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత వంశీ సినిమాలో నటించారు మహేష్. కానీ ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారి యువరాజు సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అందుకు గల కారణం ప్రకాష్ రాజ్ లేకపోవడమే అంటారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్, మహేష్ బాబు కలిసి మురారి సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది.

సినిమా కథను మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తారు ప్రకాష్ రాజ్. అయినా సూపర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత నిజం సినిమాలో నటించారు. కానీ ఈ సినిమా కాస్త యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇందులో ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా నటించాడు. స్పైడర్, బ్రహ్మోత్సవం నాని, అతిథి, 1 నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాల్లో కూడా ప్రకాష్ రాజ్ నటించలేదు. అందుకే ఈ సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి అంటారు. కానీ పోకిరి, దూకుడు వంటి సినిమాలు మాత్రం ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. ఇందులో ప్రకాష్ రాజ్ ఉన్నారు.

బిజినెస్ మ్యాన్ కూడా మంచి హిట్ అందుకుంది. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా హిట్ ను సాధించింది. ఇక భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి సినిమాలు కూడా ప్రకాష్ కాంబినేషన్ వల్ల హిట్ అయ్యాయి అంటారు. అందుకే ప్రకాష్ రాజ్ మహేష్ బాబుకు కలిసి వస్తాడని టాక్ ఉంది. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. కానీ ప్రకాష్ రాజ్ లేకుండా మహేష్ బాబు మాత్రమే ఉన్న సినిమాలు చాలా వరకు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ లేరు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక ప్రకాష్ రాజ్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఏకైక సినిమా శ్రీమంతుడు. మరి అదే ఫలితాలను గుంటూరు కారం కూడా అందిస్తుందేమో చూడాలి.