Mahesh Babu , Na anvesana
Mahesh Babu and Na anvesana : టాలెంట్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందుండే హీరోలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన కంటే చిన్నవాళ్ళని ప్రోత్సహించడంలో, తనతో సరిసమానమైన హీరోలను ఎలాంటి భేదభావాలు లేకుండా అభినందించడంలో మహేష్ బాబు ని మించిన వాళ్ళు ఈ జనరేషన్ లో లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది వరకు ఎన్నో సందర్భాల్లో ఈ విషయం రుజువైంది. రీసెంట్ గా మహేష్ బాబు ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడట. వివిధ దేశాలకు పర్యటిస్తూ, కొత్త కొత్త విశేషాలను జనాలతో పంచుకుంటూ, నా అన్వేషణ ఛానల్ ద్వారా దేశంలోనే నెంబర్ 1 ట్రావెలర్ గా మారిపోయాడు అన్వేష్. కేవలం రెండేళ్ల కాలం లో ఆయన ఇంత రేంజ్ కి ఎదగడం సాధారణమైన విషయం కాదు. ప్రతీ దేశానికీ వెళ్లి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, వాళ్ళ నాగరికత, సంస్కృతిని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటాడు ఆయన.
ఈ ఛానల్ కి 2 మిల్లియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎంతో మంది సెలెబ్రిటీలు కూడా ఈ ఛానల్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయాడు. మన అందరికీ తెలిసిందే, మహేష్ బాబు టూర్లు వేయడం అంటే ఎంత ఇష్టమో. కాస్త ఖాళీ సమయం దొరికినా ఆయన తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోతుంటాడు. బహుశా టూర్స్ మీద ఆయనకీ ఉన్న అమితాసక్తి కారణంగానే ఏమో, నా అన్వేషణ ఛానల్ ని ఫాలో అయ్యేలా చేసింది. ఇదంతా పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆయన త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కే ఈ సినిమా లో సౌత్ ఆఫ్రికా నేపథ్యం కూడా ఉంటుంది. అక్కడే ఎక్కువ కాలం షూటింగ్ చేయొచ్చు.
నా అన్వేషణ ఛానల్ లో సౌత్ ఆఫ్రికా టూర్ కి సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి. అక్కడి జనాలతో ఆయన మమేకమై , వాళ్ళతో కలిసిపోయి కొన్ని రోజులు గడిపిన వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ మహేష్ బాబు తన సినిమా అవసరం కోసం చూసి ఉండొచ్చు. అన్వేష్ టాలెంట్, కష్టాన్ని చూసి ముగ్దుడై ఆయన ఛానల్ ని అనుసరించి ఉండొచ్చు. ఇది నిజంగా అన్వేష్ కి ఎంతో గర్వ కారణం అనే చెప్పాలి. వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ తో , దేశం గర్వించ దగ్గ సినిమా తీయబోతున్న రాజమౌళి, మహేష్ బాబు లాంటి ప్రముఖులకు కూడా అన్వేష్ కష్టపడి క్రియేట్ చేసిన వీడియోల రిఫరెన్స్ అవసరం పడింది. ఇకపోతే రీసెంట్ గానే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ కాంబినేషన్ సినిమా, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టుకోనుంది.