Mahesh Babu: ఆ సినిమా చేయడం నా ఖర్మ… ఆ ప్లాప్ మహేష్ బాబుని అంత బాధ పెట్టిందా?

2015లో విడుదలైన శ్రీమంతుడు మహేష్ బాబుకు భారీ విజయం సమకూర్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చిన బ్రహ్మోత్సవం ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసింది. బ్రహ్మోత్సవం సినిమాకు కనీస వసూళ్లు రాలేదు.

Written By: NARESH, Updated On : November 17, 2023 5:24 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: ఒక కథను జడ్జి చేయడం అంత ఈజీ కాదు. దర్శకుల టాలెంట్, స్క్రిప్ట్ ని అంచనా వేయగలిగిన హీరోనే పరిశ్రమలో ఉంటాడు. తప్పుడు నిర్ణయాలు పాతాళానికి తొక్కేస్తాయి. కృష్ణ వారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన మహేష్ బాబు… కెరీర్లో అనేక సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఆచి తూచి సినిమాలు చేసే మహేష్ హీరోగా ముప్పై సినిమాలు కూడా పూర్తి చేయలేదు. మహేష్ కెరీర్లో బెస్ట్ మూవీస్ లో శ్రీమంతుడు ఒకటి. మహేష్ బాబు ఇమేజ్ కి సరిపోయే ఒక అద్భుతమైన కథను దర్శకుడు కొరటాల శివ సిద్ధం చేశాడు.

అదే స్థాయిలో స్క్రిప్ట్ రాసుకుని, అదిరిపోయే టేకింగ్ తో పూర్తి చేశాడు. 2015లో విడుదలైన శ్రీమంతుడు మహేష్ బాబుకు భారీ విజయం సమకూర్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చిన బ్రహ్మోత్సవం ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసింది. బ్రహ్మోత్సవం సినిమాకు కనీస వసూళ్లు రాలేదు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కెరీర్ కూడా ఈ మూవీ పాతాళానికి పడిపోయింది. మహేష్ బాబుతో సీరియల్ తీశాడు అంటూ ఆయన్ని ఏకిపారేశాడు.

వీరి కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్. వెంకీ-మహేష్ అన్నదమ్ములుగా ఒక సరికొత్త చిత్రం అందించారు. అలాంటి క్లాసిక్ తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల నుండి ఊహించని చిత్రం అది. మహేష్ బాబును యాంటీ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు. కాగా మహేష్ బాబు కూడా ఈ చిత్ర ఫలితంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడట. బ్రహ్మోత్సవం మూవీ చేయడం నా ఖర్మ అంటూ వాపోయాడని సమాచారం.

బ్రహ్మోత్సవం తర్వాత చేసిన స్పైడర్ కూడా డిజాస్టర్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది. దర్శకుడు మురుగదాస్ అంచనాలు అందుకోలేకపోయాడు. రెండు డిజాస్టర్స్ తర్వాత కొరటాల శివతో మరోసారి కొలాబరేట్ అయ్యాడు మహేష్. భరత్ అనే నేను మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ మూవీ సక్సెస్ మీట్లో పరోక్షంగా బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫెయిల్యూర్స్ గురించి మహేష్ మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో నేను అభిమానుల అంచనాలు అందుకోలేకపోయాను. అందుకే భరత్ అనే నేను మూవీ విజయం చాలా స్పెషల్ అన్నాడు.