https://oktelugu.com/

Chiranjeevi Tweet: మహేష్ కి థాంక్స్.. మెగా ఫ్యాన్స్ కిక్ ఇచ్చిన చిరు ట్వీట్ !

Chiranjeevi Tweet: ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వస్తున్న ఆచార్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే. సినిమాలో ‘చిరు – చరణ్ పాత్ర’ల దగ్గర నుంచి దేవాలయాల నేపథ్యం వరకూ మహేష్ వాయిస్ ఓవర్ తోనే ఈ సినిమా నడుస్తోంది. అంటే.. ఆచార్యలో మహేష్ గొంతు చాలా కీలకం కాబోతుంది. అందుకే, తన సినిమా కోసం మహేష్ తన మనోహరమైన స్వరాన్ని ఇచ్చినందుకు మెగాస్టార్ కృతజ్ఞతలు […]

Written By:
  • Shiva
  • , Updated On : April 22, 2022 / 06:08 PM IST
    Follow us on

    Chiranjeevi Tweet: ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వస్తున్న ఆచార్య కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే. సినిమాలో ‘చిరు – చరణ్ పాత్ర’ల దగ్గర నుంచి దేవాలయాల నేపథ్యం వరకూ మహేష్ వాయిస్ ఓవర్ తోనే ఈ సినిమా నడుస్తోంది. అంటే.. ఆచార్యలో మహేష్ గొంతు చాలా కీలకం కాబోతుంది. అందుకే, తన సినిమా కోసం మహేష్ తన మనోహరమైన స్వరాన్ని ఇచ్చినందుకు మెగాస్టార్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు.

    Chiranjeevi, mahesh babu

    ఇంతకీ చిరంజీవి ఆ ట్వీట్ లో ఏమి పోస్ట్ చేశాడో చూద్దాం. ‘మహేశ్ ఈ సినిమాలో భాగమైనందుకు థాంక్స్. మీ స్వరం నాకు, చరణ్‌ కి బాగా నచ్చింది. అభిమానులు, ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ అవుతారు’ అంటూ మెగాస్టార్ మెసేజ్ పోస్ట్ చేశారు. అన్నట్టు మహేష్ డైలాగ్ తోనే ఈ సినిమా ముగింపు కూడా ఉంటుందట. బలమైన నేపథ్యంతో భారీగా తెరకెక్కిన ఆచార్యకి మహేష్ మాట తోడు అయితే.. ఇక థియేటర్స్ కూడా ఊగిపోవడం ఖాయం.

    Also Read: Animal: లవ్ కి రష్మిక రొమాన్స్ కి పూజా హెగ్డే ఫిక్స్ !

    మొత్తానికి మెగా మూవీకి మహేష్ మాట సాయం చేశాడు అని వార్త రాగానే.. తెలుగు సోషల్ మీడియా కూడా ప్రస్తుతం షేక్ అయిపోతుంది. ఇక ఇది వరకే మహేష్ బాబు పలు సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చి.. ఆ సినిమాల సక్సెస్ లో భాగం అయ్యాడు. ఎన్టీఆర్ బాద్షా కి, పవన్ కళ్యాణ్ జల్సాకి కూడా మహేష్ తన వాయిస్ ఇచ్చాడు. పైగా ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

    Chiranjeevi, mahesh babu

    ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్ విషయంలో చిరు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. అన్నట్టు ఆచార్యలో చ‌ర‌ణ్ పాత్ర‌ ఎంతసేపు ఉంటుంది ? ఆచార్య‌లో చ‌ర‌ణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండ‌బోతుంది.

    చిరు – చరణ్ మ‌ధ్య ఉండే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఏప్రిల్‌ 29న స‌మ్మ‌ర్ కానుక‌గా థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ర‌న్ టైం సుమారు 2 గంట‌ల 58 నిమిషాలు ఉండేలా కొర‌టాల ప్లాన్ చేశాడు.

    Also Read:Janhvi Kapoor: విజయ్ దేవరకొండతో చెయ్యట్లేదు.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్

    Recommended Videos:

    Tags