1996 Dharmapuri Movie Review: 2014 నుంచి తెలుగు సినిమా శైలి ని గమనిస్తే మూడు విషయాలను గమనించొచ్చు.ఒకటి తెలంగాణ యాస,సంస్కృతి పైన పెళ్లి చూపులు,జాతిరత్నాలు,మల్లేశం లాంటి కొత్త రకపు సినిమాలు రావటం. రెండవ విషయం వాస్తవ సంఘటన ఆధారంగా సినిమాలు రావటం, మూడు రంగస్థలం లాంటి గ్రామీణ నేపథ్యంలో సినిమాలు రావటం.ఇలా తెలంగాణ యాసలో, గ్రామీణ నేపథ్యంలో,వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా 1996 ధర్మపురి అని చెప్పొచ్చు. దానితో పాటు సౌత్ ఇండియా టాప్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఆశీస్సులతో, నల్లరేణి కన్నుల లాంటి ట్రేండింగ్ పాట తో ప్రమోషన్లో అదరగొట్టిన ఈ సినిమా
ఎలా ఉందో చూద్దాం.
కథ విషయానికొస్తే 1996 కాలంలో ధర్మపురి ఊళ్ళో జరిగిన ఒక యదార్ధ పొలిటికల్ రొమాంటిక్ సినిమా గా చెప్పొచ్చు.ఎన్నో ట్విస్టులతో నడిచే ఈ కథను తెరపై చూసి ఎంజాయ్ చేయాల్సిందే.కథను రాయటంలో కథ రచయిత,దర్శకుడు జగత్ విజయం సాదించినట్లే.
ఇక మాటల విషయానికొస్తే తెలంగాణ యాసలో అదరగొట్టిన జగత్, కథనం విషయంలో కొంచెం తడబడినట్లు కనిపించాడు.చెప్పాల్సిన విషయాలను పొడిపొడిగా చెప్పినట్లు,ఎక్కువ రిజిస్టర్ కాకుండా ,ఫస్ట్ హాఫ్ లో ఉన్న వేగం రెండవ భాగంలో తగ్గినట్లు కనిపించినా క్లైమాక్స్ లో మాత్రం ప్రేక్షకులకు తన విభిన్నమైన ఫీనిషింగ్ తో టచ్ ఇచ్చి లాస్ట్ పంచ్ బాగుంటే ఆ కిక్కే వేరన్నట్లు కథ చెప్పాడు.ప్రధానంగా బీడీలు చేసే సన్నివేశాలు,హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు,మల్లన్న పట్నాల చూయించిన విధానం బాగుంది. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ అయిన బీడీ కార్మికుల కష్టాలు, అవమానాలు ఈ సినిమాలో చూయించటం విశేషం.
Also Read: Vasireddy Padma: వియవాడ గ్యాంగ్ రేప్ పరామర్శకు వచ్చిన వాసిరెడ్డి పద్మకు సాకిచ్చిన మహిళలు
ఇక నటి నటుల విషయానికొస్తే కొన్ని పాత్రలు రంగస్థలం తాలూకు ఛాయలు కనిపించాయి. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్ హీరో,హీరోహిన్.హీరో కట్ ఔట్ ఉన్నా కూడా ఇప్పటివరకు విలన్ గ్యాంగ్ లో ఒకడిగా చిన్న రోల్స్ చేసిన గగన్ విహారి ఈ మూవీ లో సూరి అనే పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు.మంచి సెటిల్ ప్రదర్శణ ఇచ్చాడు.డాన్సులు చేసే అవకాశం ఎక్కువ లేకపోయినా నల్లరేగడి కన్నుల సాంగ్ లో సిందూరం సినిమాలో రవితేజ ను మరిపించేలా ప్రామిసింగ్ గా కనిపించాడు. ఫైట్స్ కూడా బాగా చేశాడు.మంచి స్క్రిప్ట్స్ వస్తే రాబోయే రోజుల్లో రవితేజ స్థానాన్ని భర్తీ చేస్తాడు. హీరోయిన్ అపర్ణ దేవి అయితే కళ్ళతో సినిమా నడిపించింది. ఒక సమయంలో ఈ సినిమాను భుజాల మీద వేసుకొని నడిపింది.గ్రామాల్లో బీడీలు చేసే అమ్మాయి ఎలా ఉంటుందో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది.మంచి భవిష్యత్తు ఉన్న నటి.ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేక అభిమానులు ఏర్పడుతారు.మిగతా నటుల విషయానికొస్తే రంగస్థలం నాగ మహేష్ ఎప్పటిలా మెప్పించాడు. సర్పంచిగా నటించిన వ్యక్తి ఒకే అనిపించాడు. విలన్లు పెద్దగా ప్రభావం చూపలేదు.హీరో హీరోహిన్ స్నేహితుల పాత్రలు బాగున్నాయి.బీడీల వ్యాపారి పాత్ర చిన్నదైనా మెప్పించాడు.సర్పంచ్ భార్య పాత్ర ఒకే అనిపించింది.
నిర్మాణ విలువల సంగతికొస్తే ప్రముఖ నిర్మాత,తెలంగాణ ఉద్యమకారులు భాస్కర్ యాదవ్ మనసు పెట్టి తీసినట్లు తెర మీద కనిపిస్తుంది.స్వతహాగా పాటల రచయిత అయిన భాస్కర్ ఈ సినిమాకు ఆయువు పట్టు అయిన నల్లరేణి కన్ను పాట సాహిత్యాన్ని రాయటం విశేషం.ఈ పాట విడుదల అయినప్పటి నుంచి చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమాలో కూడా ఈ పాట వచ్చినపుడు మంచి ఊపు వస్తుంది.ఈ సినిమాకు మరో ప్లస్ సంగీత దర్శకుడు ఓషో వెంకటేష్.అన్ని పాటలు బాగున్నాయి.నేపథ్య సంగీతం చాలా బాగుంది.కెమెరా వర్క్ బాగున్నా రాత్రి వేళల్లో వచ్చే సన్నివేశాల్లో సరైన లైటింగ్ లేదనిపించింది. ఈ సినిమాకు శేకర్ మాస్టర్ మార్క్ డాన్సులు లెవనిపించింది. ప్రధానంగా కొంచెం స్లో గా వెళ్లిన రెండవ భాగంలో ఒక మాస్ సాంగ్ ఉంటే సి సెంటర్లో మారుమోగేది.ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ తన మార్కును చూయించలేకపోయాడు అని చెప్పొచ్చు.
చివరగా ఈ మూవీ ధర్మపురి ఆలయం ఎంత పవిత్రంగా ఉంటుందో ఈ సినిమాలో ప్రేమ అంత పవిత్రంగా కనిపిస్తుంది.
రేటింగ్: 3/5
Also Read: Janhvi Kapoor: విజయ్ దేవరకొండతో చెయ్యట్లేదు.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
Recommended Videos: