Hero Mahesh Babu: ఈ జనరేషన్ హీరోలలో మహేష్ చాలా డిఫరెంట్. ఆయన పర్సనల్ లైఫ్ నుండి కెరీర్ వరకు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. మహేష్ విజయ రహస్యం కూడా అదే. వరుసగా సినిమాలు చేస్తూనే పదుల సంఖ్యలో బ్రాండ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో సొంతగా బిజినెస్ లు నిర్వహిస్తున్నారు. మొదట మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటరైన మహేష్, తర్వాత ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. 2019లో ది హంబుల్ కో పేరుతో గార్మెంట్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. తన వైఫ్ నమ్రత సహకారంతో వీటన్నింటిని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు మహేష్.

కాగా మహేష్ మరో కొత్త వ్యాపారంపై కన్నేసినట్లు సమాచారం అందుతుంది. సాంకేతిక విప్లవం తో ప్రతి అవసరం యాప్స్ రూపంలో అందుబాటులోకి వస్తుంది. చివరికి పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఇంటినుండే సాగుతుంది. లాక్ డౌన్ వలన ఆన్లైన్ ఎడ్యుకేషన్ మెథడ్ ప్రాచుర్యం పొందింది. దీంతో బైజూస్ వంటి అనేక ఎడ్యుకేషన్, టీచింగ్ రిలేటెడ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. రానున్న కాలంలో వర్చువల్ రియాలిటీ క్లాసెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరిగే అవకాశం కలదు.
Also Read: త్రివిక్రమ్- మహేశ్ కాంబినేషన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అప్పటినుంచే!
దీంతో మహేష్(Hero Mahesh Babu) ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. అత్యున్నత ప్రమాణాలు, కొత్త మెథడ్స్ తో ఓ లెర్నింగ్ యాప్ స్థాపించనున్నారట. దీని కోసం మహేష్ టీం కసరత్తు కూడా మొదలు పెట్టారట. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఓ లెర్నింగ్ యాప్ డెవలప్ చేసే పనిలో నిమగ్నమయ్యారట. ప్రాథమిక విద్య నుండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉపయోగించుకునేలా ఈ యాప్ ఉండనుందని సమాచారం.
మరోవైపు మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల స్పెయిన్ షెడ్యూల్ ముగించుకుని వచ్చిన టీమ్ నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సర్కారు వారి పాట సమ్మర్ కానుకగా 2022 ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఇక త్రివిక్రమ్ తో ప్రకటించిన మూవీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read: ఒకే స్క్రీన్‌పై ప్రభాస్- మహేశ్… థమన్ ట్వీట్ వైరల్!