Chandrababu Crying: సెంటిమెంట్ కంటిన్యూ: అసభ్య వ్యాఖ్యలపై చంద్రబాబు భార్య స్పందన

Chandrababu  Crying:  అసెంబ్లీ సాక్షిగా తన భార్యను తిట్టారని చంద్రబాబు బోరుమన్నారు. ఆయన ఏడుపు కదిలించింది. నారా ఫ్యామిలీని ఏకం చేసింది.. బయటకొచ్చి మాట్లాడించింది. బాలయ్య, నందమూరి కుటుంబ సభ్యులు ఖండించారు. హీరో ఎన్టీఆర్ సైతం బయటకొచ్చి తప్పు అన్నారు. ఇక వైసీపీ నేతలు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లాంటి వారు చంద్రబాబుది మొసళి కన్నీరని.. ఆయన ఎంతో మందిని ఏడిపించారని పండుగ చేసుకున్నారు. ఇక ఈ వివాదంలో వైసీపీ డిఫెన్స్ పడింది. దీంతో సీఎం […]

Written By: NARESH, Updated On : November 26, 2021 6:08 pm
Follow us on

Chandrababu  Crying:  అసెంబ్లీ సాక్షిగా తన భార్యను తిట్టారని చంద్రబాబు బోరుమన్నారు. ఆయన ఏడుపు కదిలించింది. నారా ఫ్యామిలీని ఏకం చేసింది.. బయటకొచ్చి మాట్లాడించింది. బాలయ్య, నందమూరి కుటుంబ సభ్యులు ఖండించారు. హీరో ఎన్టీఆర్ సైతం బయటకొచ్చి తప్పు అన్నారు. ఇక వైసీపీ నేతలు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లాంటి వారు చంద్రబాబుది మొసళి కన్నీరని.. ఆయన ఎంతో మందిని ఏడిపించారని పండుగ చేసుకున్నారు. ఇక ఈ వివాదంలో వైసీపీ డిఫెన్స్ పడింది.

nara-bhuvaneswari

దీంతో సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లు రద్దు అంటూ హడావుడి చేసి చంద్రబాబు ఏడుపును విజయవంతంగా డైవర్ట్ చేశారు. ప్రజల దృష్టిని ఇటువైపు మళ్లించారు. అయితే ఆ అవమానాన్ని చంద్రబాబు అంత ఈజీగా మరిచిపోయేలా చేయాలనుకోవడం లేదని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పెద్ద వివాదంలోకి చంద్రబాబు భార్య వచ్చేసింది. భార్యను లాగి సెంటిమెంట్ ను రగిల్చారు చంద్రబాబు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వరి విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read: చంద్రబాబుకు ‘రూట్’ దొరికింది..! వ్యూహంలో మార్పు.. ఇక ప్లాన్ బి

‘నాకు జరిగిన ఈ అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడడం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి విలువలతో పెరిగా.. పాటిస్తున్నా.. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ ఎవరూ వ్యవహరించకూడదు.. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికి జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.

ఇలా చంద్రబాబు కన్నీటితో మొదలైన సెంటిమెంట్ కథ.. వైసీపీ మూడు రాజధానుల రద్దుతో సమసిపోయింది. అనంతరం నారా భువనేశ్వరి తాజాగా రంగంలోకి దిగి మరోసారి దీన్ని రగిలించింది. సో ఇది కంటిన్యూ కాబోతోందన్న మాట..

Also Read: బాబూ… ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పు… నేషనల్ వైడ్ ఇదే హాట్ టాపిక్