https://oktelugu.com/

Brahmanandham: అరుదైన ఘనత దక్కించుకున్న హాస్య బ్రహ్మ… బ్రహ్మానందం

Brahmanandham: టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూస్తాయి. సినిమాల్లో ఏ నటుడికీ సాధ్యంకాని విధంగా గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారాయన. కమెడియన్ గా వేల సినిమాల్లో నటించి కోట్ల మందిని కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మీ. ఇటీవల ఆయన సినిమాల్లో కనిపించడం తగ్గించారు. అలాగే ఎన్నో పురస్కారాలు హాస్యబ్రహ్మను వరించాయి. అలాంటి బ్రహ్మానందం ఏ నటుడికీ […]

Written By: , Updated On : November 26, 2021 / 01:50 PM IST
Follow us on

Brahmanandham: టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూస్తాయి. సినిమాల్లో ఏ నటుడికీ సాధ్యంకాని విధంగా గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారాయన. కమెడియన్ గా వేల సినిమాల్లో నటించి కోట్ల మందిని కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మీ. ఇటీవల ఆయన సినిమాల్లో కనిపించడం తగ్గించారు. అలాగే ఎన్నో పురస్కారాలు హాస్యబ్రహ్మను వరించాయి. అలాంటి బ్రహ్మానందం ఏ నటుడికీ సాధ్యం కాని ఘనతను, గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా అత్యంత అరుదైన గౌరవం ఆయన్ను వరించింది.

tollywood comedian bramanandham got another honour

హెచ్.ఆర్ చంద్రం బ్రహ్మానందం పై ఒక పుస్తకాన్ని రచించి పబ్లిష్ చేశారు. ఒక నటుడిపై 108 పద్యాలతో శతకాన్ని రచించడం భారత చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇటీవల బ్రహ్మానంద శతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మిత్రులు గడ్డం విజయసారధి పుస్తకాన్ని ఆవిష్కరించి మరో మిత్రుడు పుల్లారెడ్డికి అంకితమిచ్చారు. తనపై శతకం రంచించడంపై నటుడు బ్రహ్మానందం హర్షం వ్యక్తం చేశారు. తాను ఎంత ఎదిగిన నా సహచర మిత్రులతో ఒదిగి ఉంటానని ఆయన అన్నారు. నాపై అభిమానంతో సీనియర్ జర్నలిస్ట్ పూల్లారెడ్డి అర్ధిక అంశాలను అధిగమించి పుస్తకాన్ని సమాజానికి అందించటం అభినందనీయం అన్నారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం… ఇప్పటివరకు ఐదు నంది అవార్డులు, సహాయ నటుడికి ఒక నంది అవార్డు దక్కించుకున్నారు. 2009 కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.