Mahesh Babu And Pawan Kalyan: ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలు అతనికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను అయితే తీసుకొచ్చాయి. ఇక దాంతో మురారి, ఒక్కడు, అతడు, పోకిరి లాంటి వరుస సక్సెస్ లతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పటికీ ఆయన మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ప్రస్తుత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు కి అత్యంత సన్నిహితులైన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు… దాదాపు వీళ్లిద్దరి కెరియర్ ఒకేసారి స్టార్ట్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది.
Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?
మరి ఈ బాండింగ్ తో వీళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక మొదటిసారి మహేష్ బాబు తన కొడుకు అయిన గౌతమ్ విషయంలో పవన్ కళ్యాణ్ సలహా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అనే డౌట్ అందరికీ రావచ్చు. గౌతమ్ కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలనే ప్రయత్నంలో మహేష్ బాబు ఉన్నాడట.
దానికోసం పవన్ కళ్యాణ్ ని కలిసి ఎలా ట్రైన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో అతనితో కాసేపు చర్చించినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు తన కొడుకును హీరోగా రంగంలోకి దించడానికి చాలా కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటినుంచి తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించి వీలైనంత తొందరగా అతన్ని హీరోగా ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ విషయంలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సలహా తీసుకోవడం అనేది అటు మహేష్ బాబు అభిమానుల్లో గాని, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో గాని ఆనందాన్ని నింపుతోంది. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి కొన్ని విషయాలు చర్చించుకొని మరి ముందుకు సాగినట్టుగా తెలుస్తోంది…