Pawan Kalyan And Balakrishna: నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. కెరియర్ స్టార్టింగ్ నుంచి నెంబర్ వన్ పొజిషన్ ని అందుకోవడానికి బాలయ్య బాబు తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక మొదటి నుంచి చిరంజీవితో సినిమాల పరంగా చాలా వరకు పోటీని ఎదుర్కొంటూ వస్తున్న బాలయ్య ఎప్పటికప్పుడు ఆయనకు తీవ్రతరమైన పోటీని ఇస్తూ వచ్చాడు. మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు సైతం నెంబర్ వన్ పొజిషన్ ని అందుకుంటాడు అని ఒకానొక సందర్భంలో వార్తలు వచ్చినప్పటికి బాలయ్యకు సరైన సక్సెస్ రాకపోవడం వల్ల ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది…ఇక ఇదిలా ఉంటే చిరంజీవి వాళ్ళ తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బాలయ్య బాబుకి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా స్టోరీ మొదట బాలయ్య బాబు దగ్గరికి వెళ్తే అది నాకంటే పవన్ కళ్యాణ్ కి బాగుంటుందని బాలయ్య సజెస్ట్ చేశారట.
Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?
దాంతో దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అతనికి ఆ కథ చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ‘భీమ్లా నాయక్’… మలయాళం ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయిన ‘అయ్యప్పనం కోషియం’ సినిమాని తెలుగు లో రీమేక్ చేయాలని ప్రొడ్యూసర్ నాగ వంశీ అనుకున్నప్పుడు బాలయ్య బాబుతో చేస్తే బాగుంటుందని అతను బాలయ్య ను కలిసి కథను వినిపించాడు.
కానీ దానికి బాలయ్య మాత్రం పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఆయన చేస్తే బాగుంటుందని చెప్పడంతో ఆ సినిమా స్టోరీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. మొత్తానికైతే బాలయ్య చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు పొలిటికల్ గా ఒకే ఎజెండాతో ముందుకు సాగుతున్న జనసేన, టిడిపి పార్టీలు మంచి సన్నిహిత్యంతో ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ మధ్య కూడా ఇప్పుడు చాలా మంచి ర్యాపో అయితే ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…